యువ హీరో కిరణ్ అబ్బవరం మూడు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తుంటే చాలా మంది కామెడిగా మాట్లాడేవారు. నిర్మాతలను బెదిరించి సినిమాలు చేస్తున్నాడని.. ఏదొకటి కామెంట్ చేసేవారు. ఇప్పుడు ప్రభాస్ అంతకు మించిన స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి టైంలో అయిదేళ్ళు గ్యాప్ వచ్చింది ఓకే… కానీ ఆ గ్యాప్ ను ఇప్పుడు ఫిల్ చేయాలనో లేక ఫాస్ట్ గా భారీ ప్రాజెక్ట్ లు చేసి పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోవాలనే ప్లానో అర్ధం కావడం లేదు గాని.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.
Also Read : ఆ పదవి కోసం ఎందుకంత పోటీ..?
ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్న ప్రభాస్, ఆ తర్వాత హనూ రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే టైటిల్ తో ఒక సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూట్ స్టార్ట్ అయి చాలా వరకు కంప్లీట్ అయినట్టు టాక్. ఆ తర్వాత కొంత కొంత షూట్ జరుపుకున్న కల్కీ 2, సలార్ 2 చేయనున్నాడు. వీటి కంటే ముందు ‘స్పిరిట్’ సినిమాను ఫినిష్ చేస్తాడు. రాజాసాబ్, ఫౌజీ సినిమాలు 2025 లో రిలీజ్ అయితే 2026 లో సలార్ 2, స్పిరిట్ రిలీజ్ అవుతాయి. ఇప్పటికే వీటి షూట్ కూడా స్టార్ట్ అయింది.
Also Read : టీటీడీ సిఫార్సు లేఖలపై గుడ్ న్యూస్…!
ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్ లో ఉండటంతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ 2 షూట్ ను ఫినిష్ చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేసే భక్త కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. ఇక 2027లో కల్కీ 2, లోకేష్ కనగరాజ్ సినిమాను రిలీజ్ చేస్తాడు. 2028 లో ఓ సినిమా హోంబలే బ్యానర్ లో కాగా మరో సినిమా సితార బ్యానర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. హోంబలే బ్యానర్ లో ప్రశాంత్ వర్మ మూవీ లైన్ లో ఉంది. సితారా బ్యానర్ లో లోకేష్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో సినిమాలు చేస్తున్న హీరో ప్రభాస్ మాత్రమే.