Thursday, October 23, 2025 06:12 PM
Thursday, October 23, 2025 06:12 PM
roots

త్వరలో మంత్రివర్గంలో భారీ మార్పులు..!

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా 16 నెలలు దాటింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో ప్రతి నేతకు కూడా ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. ఏ చిన్న తప్పు చేసినా సరే.. అది ప్రభుత్వంపైన, పార్టీ పైనా ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే.. ఇప్పటి నుంచే ప్రజల్లో మంచి పేరు సంపాదించాలని.. అలాగే పార్టీతో పాటు కూటమి నేతలతో కూడా సఖ్యతగా ఉండాలని సూచించారు. కానీ కొందరు నేతలు మాత్రం అవేవీ లెక్కచేయడం లేదు. పైగా పార్టీతో పనేంటి.. నా పదవి నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో ఇతర నేతలపై పెత్తనం చేస్తూ.. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో కూటమి ప్రభుత్వంలో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.

Also Read : ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్ చేసేవారు లేరా..?

2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి సత్య కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. అలాగే జనసేన నుంచి పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ పథకాల అమలును సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోంది. అయితే కొందరు నేతల తీరు వల్ల కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ లేదా.. వచ్చే సంక్రాంతి నాటికి మంత్రివర్గంలో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి స్వయంగా రిపోర్టులు సేకరించారు. కొందరి పనితీరుపై సీఎం చాలా సీరియస్‌గా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది.

Also Read : నా తండ్రికి ఆమె భార్య కాదు.. మాగంటి గోపీనాథ్ కొడుకు సంచలనం

మంత్రివర్గ విస్తరణలో భాగంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తప్పని సరిగా మంత్రి పదవి దక్కనుంది. పల్లాను కేబినెట్‌లోకి తీసుకుంటామని చంద్రబాబు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించారు. దీంతో ఆయనకు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఆయన స్థానంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో బీసీ నేత కొల్లు రవీంద్రకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో కీలక మార్పు ఖాయమంటున్నారు పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడును తొలగించి.. ఆయన స్థానంలో కూన రవికుమార్‌కు కేబినెట్‌లో చోటు దక్కనుందని తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నపై ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు యూరియా కొరతపై కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడానికి అచ్చెన్న అలసత్వమే కారణమని ఇప్పటికే సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అచ్చెన్న పై వేటు ఖాయమంటున్నారు. అలాగే సత్యకుమార్‌ను తప్పించి.. ఆయన స్థానంలో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు లేదా కామినేని శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను తప్పించి.. పల్నాడు జిల్లాకు చెందిన యరపతినేనికి కేబినెట్‌లో చోటు ఖాయమంటున్నారు ప్రభుత్వ పెద్దలు. సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణ ముహుర్తం ఉంటుందనే మాట ప్రస్తుతం పార్టీలో బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

పోల్స్