భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆటగాళ్లను అవమానిస్తోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఏళ్ళ తరబడి జట్టుకు ఆడిన వాళ్లకు కనీసం విలువ లేకుండా చేస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లకు సరైన వీడ్కోలు లేకుండా చేయడం కరెక్ట్ కాదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తప్పుకున్నారు. వీరి తర్వాత పుజారా తప్పుకున్నాడు.
Also Read : టార్గెట్ బాబు, పవన్.. ప్రకాష్ రాజ్ కామెంట్..!
వీరిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా సరైన వీడ్కోలు లేదు. రోహిత్ శర్మ మినహా మిగిలిన ముగ్గురూ వంద టెస్ట్ లు ఆడారు. రోహిత్, కోహ్లీ సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్ గా సేవలు అందించారు. పుజారా ఏకంగా 103 టెస్ట్ లు ఆడాడు. గబ్బా లాంటి విజయాలు అందించాడు పుజారా. తమ సారధ్యంలో రోహిత్, కోహ్లీ జట్టును అగ్ర స్థానంలో నిలిపారు. బౌలర్ గా బ్యాటర్ గా అశ్విన్ ఎంతో అద్భుత ప్రదర్శనలు చేసారు. కానీ ఈ నలుగురుని అంతర్గత రాజకీయాలతో అర్ధంతరంగా జట్టు నుంచి తప్పుకునేలా చేసింది బోర్డు అనే విమర్శలు ఉన్నాయి.
Also Read : వన్డేలు ఆడతారు.. కోహ్లీ, రోహిత్ పై బోర్డు క్లారిటీ..!
కోహ్లీ లాంటి ఆటగాడికి వీడ్కోలు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. జట్టు ప్రమాణాలను ఓ లెవెల్ కు తీసుకెళ్ళాడు. అలాంటి వ్యక్తి కూడా ఇంగ్లాండ్ సీరీస్ కు ముందు సడెన్ గా తప్పుకున్నాడు. ఆసిస్ పర్యటన మధ్యలోనే అశ్విన్ తప్పుకున్నాడు. ఫాంలో ఉన్నా సరే పుజారాకు కనీసం జట్టులో చోటు కల్పించలేదు. గతంలో కూడా పలువురు ఇలాగే అర్ధంతరంగా క్రికెట్ కు దూరమయ్యారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. క్రమశిక్షణతో ఏళ్ళ తరబడి ఆడిన ఆటగాళ్లకు ఈ అవమానం భావ్యం కాదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.