Friday, September 12, 2025 07:07 PM
Friday, September 12, 2025 07:07 PM
roots

విమానాన్ని కూల్చేస్తా.. మహిళా డాక్టర్ ఓవరాక్షన్ కు పోలీసుల ట్రీట్మెంట్

గత వారం జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఆందోళనకర టైం లో బెంగళూరులో ఓ డాక్టర్ చేసిన పని చికాకుగా మారింది. సోమవారం సదరు డాక్టర్ చేసిన పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వారం ప్రారంభంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, విమానాన్ని కూల్చివేస్తానని బెదిరించిన 36 ఏళ్ల మహిళా డాక్టర్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : రప్ప రప్ప ఎవరిని నరుకుతావ్ జగన్..? పయ్యావుల అదిరిపోయే కౌంటర్

మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి IX2749 విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. మహిళా ప్రయాణీకురాలు వ్యాస్ హిరల్ మోహన్‌భాయ్ తన లగేజ్ ను విమానంలోని మొదటి వరుసలో వదిలి 20F వద్ద కూర్చున్నారు. ఆమె బ్యాగ్ పెట్టడంపై క్యాబిన్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ లగేజ్ ను తన సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌ లో ఉంచమని కోరారు.

Also Read : ఎయిర్ ఇండియా సంచలనం.. ఆ రూట్స్ లో విమానాలు క్యాన్సిల్

అందుకు నిరాకరించిన ఆమె.. ఆమె తన బ్యాగ్‌ను తన సీటులో పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ సమయంలో పైలెట్ కూడా వచ్చి ఆమెను రిక్వెస్ట్ చేసినా ఆమె వినలేదు. ఇక అక్కడే ఉన్న ప్రయాణికులు కూడా జోక్యం చేసుకోవడంతో వారిపై ఆమె విరుచుకుపడింది. ఈ సమయంలో నేను విమానాన్ని కూల్చేస్తా అంటూ ఆమె బెదిరించడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు క్యాబిన్ క్రూ సిబ్బంది. బెంగళూరులోని యలహంక సమీపంలోని శివనహళ్లి నివాసి అయిన సదరు డాక్టర్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 351 (4), 353 (1) (బి) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్