తెలంగాణలో ఎలాగైనా గులాబీ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయనే సంకేతాలు ఇప్పటివరకు వచ్చాయి. ఇక భారత రాష్ట్ర సమితి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ముఖ్యంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ మారతారో అర్థం కాక ఎవరు ఏ పార్టీలోకి వెళతారో క్లారిటీ లేక బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఏం చేయాలో తెలియక సైలెంట్ గానే ఉండిపోయింది. ఇక గతంలో గులాబీ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ప్రతిసారి కేంద్రమంత్రి బండి సంజయ్ లేదంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు పదేపదే కౌంటర్లు ఇచ్చేవారు.
Also Read : విసారెడ్డి రాజీనామా పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
అలాంటి బీజేపీకి ఇప్పుడు ఉమ్మడిగా షాక్ ఇచ్చాయి బి.ఆర్.ఎస్, కాంగ్రెస్. రీసెంట్ గా బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే కాబట్టి రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లను ఇందిరమ్మ ఇల్లు అని కాకుండా పీఎం ఆవాస్ యోజన కింద ఇస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని స్పష్టం చేశారు.
పేరు పెడితేనే ఇళ్ల నిర్మాణానికి సహకారం అందిస్తామని.. డబ్బులు ఇస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీగా పన్నుల రూపంలో డబ్బులు వెళుతున్నాయని.. మరి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటోలు పెడుతున్నారా అని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నించారు. కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాటా కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం కూడా రాష్ట్రాల నేతల ఫోటోలు పెట్టాలనే డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి బలంగా వినపడింది.
Also Read : వైసీపీ క్యాడర్ భయం వెనుక కారణం జగన్ రెడ్డేనా..?
ఇక దీనికి పరోక్షంగా గులాబీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రాల్లో పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. వాటికి కేంద్రానికి ఏం పని అని ఆమెను నిలదీశారు. బాధ్యతాయుత కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక ఇల్లు కూడా తెలంగాణకు ఇవ్వమనే మాట మాట్లాడొచ్చా అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అని ఫైరయ్యారు కవిత. అటు తిరిగి ఇటు తిరిగి బండి సంజయ్ వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయి. ఈ విషయంలో కవిత కూడా మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక బిజెపి అయితే వీళ్ళిద్దరూ ఒకటే అంటూ తిట్టడం మొదలు పెట్టింది.