దంతాల సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. తినే ఆహారం కారణంగా దంతాల సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇక పళ్ళు రంగు మారిపోవడం కూడా చికాకు పెడుతోంది. దీనితో దంతాలు తెల్లగా మారడానికి క్లీనింగ్ బాట పడుతున్నారు. మార్కెట్ లో అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ సహజంగా పళ్ళు తెల్లబడే మార్గం ఉందంటున్నారు నిపుణులు. దంతాలను తెల్లగా మార్చడానికి.. అరటి తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు.
Also Read : ఇండియాలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక..!
దంతాలపై అరటి తొక్కతో రుద్దితే పళ్ళు తెల్లగా అవుతాయని చెప్తున్నారు నిపుణులు. ఇప్పటి వరకు ఇది అపోహ మాత్రమే అని భావించినా దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) ప్రకారం, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి… అరటిపండ్లు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తున్నారు. నోటి ఆరోగ్యానికి అరటిపండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి.
Also Read : చంద్రయ్య కేసు సిఐడీకి.. న్యాయం జరుగుతుందా..?
ఇవి దంతాలను తెల్లగా చేయడంలో సహాయపడతాయని రుజువు అయింది. అరటిపండ్లు మొత్తం నోటి ఆరోగ్యానికి వివిధ మార్గాల్లో దోహదపడతాయి. అరటి తొక్కల్లో పొటాషియం, మెగ్నీషియం మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి, ఇవి దంతాలపైన ఉండే మరకలను తొలగించడంలో సహాయపడతాయని వైద్యులు పేర్కొన్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా బేకింగ్ సోడాతో తయారు చేసిన పేస్ట్ లు లేదా ఇతర ఉత్పత్తుల కారణంగా ఎనామిల్ పోయే అవకాశం ఉంటుంది. కాని అరటి తొక్కలు రాపిడి కలిగించవట. దీని కారణంగా ఎనామిల్ కూడా పోయే అవకాశం లేదు. అరటిపండ్లు తినడం వల్ల దంతాలు, చిగుళ్ళు బలంగా మారుతాయి. అరటిపండ్లలో కాల్షియం, విటమిన్ డి ఉండటంతో ఎనామిల్ కు రక్షణ ఉంటుంది. అలాగే అరటి పళ్ళు తింటే నోటి దుర్వాసన కూడా ఉండదు.