వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసారు. పార్టీలో తనకు జరిగిన అవమానాలతో బయటకు వెళ్తున్నట్టు ప్రకటించారు. గత కొన్నాళ్ళుగా బాలినేని పార్టీ మారే విషయంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వచ్చాయి. ఇక బాలినేని విషయంలో టీడీపీ నేతలు కొందరు సానుకూలంగా ఉన్నా ఆయనను నమ్మే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయనే చెప్పాలి. ఇక రాజీనామా సందర్భంగా బాలినేని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read Also : వైసీపీ పాపాలు: తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు
వైసిపి లో ఒక కోటరీ గతంలో నడిచింది ఇప్పుడూ కూడా నడుస్తుందన్నారు ఆయన. నేను ఆ పార్టీ లో ఉండొద్దు అని వైసిపి నాయకులే కోరుకున్నారని ఒంగోలు ఎంపి సీట్ వ్యవహారం లో నేను చెప్పిన మాగుంట కు టికెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి కి ఇచ్చారు అని మండిపడ్డారు. నా పై సొంత పార్టీ నాయకులే అసత్య ప్రచారాలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను గత కొద్ది రోజుల నుంచి నేను వ్యతిరేకిస్తున్నానన్న ఆయన ఆ నిర్ణయాలకు కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపారు.
ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు బాలినేని. వైసీపీలో అవమానం జరగడంతోనే పార్టీకి ఈరోజు రాజీనామా చేశానని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని కొన్ని విషయాలు చెప్పాను వాటిని నెగిటివ్గా తీసుకున్నారని పార్టీలో నాకు జరిగిన అవమానాలు అన్ని విషయాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని స్పష్టం చేసారు.




