అనుకున్నంత అయ్యింది. దసరా పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుందామనుకున్న బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది. దసరాకు థియేటర్లలో శివ తాండవం వేసేందుకు సిద్ధమవుతున్న బాలయ్య ఫ్యాన్స్ ఆశలపైన నీళ్లు జల్లారు. టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అఖండ 2 సినిమా గురించి కీలక అప్‌డేట్ రిలీజ్ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేస్తున్నట్లు సినిమా టీజర్‌లోనే ప్రకటించిన 14 రీల్స్ బ్యానర్.. ఇప్పుడు మాట మార్చేసింది.
Also Read : జూనియర్ సెహ్వాగ్ అదిరిపోయే బ్యాటింగ్
60 పదుల వయసులో కూడా వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలకృష్ఱ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న బీబీ-4 ప్రాజెక్టుపై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన మొదటి సినిమా అఖండ. రికార్డుల మోత కూడా మోగించింది. 2021 తర్వాత సరిగ్గా నాలుగేళ్లకు అఖండ 2 రిలీజ్ అవుతుండటంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.
టీజర్‌తో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన అఖండ 2 ఎప్పుడెప్పుడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో సినిమా నిర్మాతలు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్లు ప్రకటించిన నిర్మాతలు.. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్స్ అందించేందుకు రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను చెప్పిన డేట్ సెప్టెంబర్ 25న చేయలేకపోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు. అఖండ 2 ఓ సినిమా మాత్రమే కాదని.. ఇది సినిమా పండుగ అని వెల్లడించారు.
Also Read : బండి సంజయ్ కు హీరో ఇమేజ్.. అసలు ఏం జరిగింది..?
అయితే అఖండ 2 వాయిదా తర్వాత సినీ పరిశ్రమలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అఖండ 2 వాయిదా వెనుక అసలు కథ వేరే ఉందన్నారు. ఓటీటీ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగలేదని.. అందుకే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ హీరోగా దసరా పండుగకు వస్తున్న ఓజీ సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇక అమెజాన్ ప్రైమ్ కూడా మరో బడా సినిమాతో డీల్ కుదుర్చుకుంది. జీయో హాట్ స్టార్ పెద్ద మొత్తం ఖర్చు చేసేందుకు ముందుకు రాక పోవడంతో.. అఖండ 2ను డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు. ఏది ఏమైనా.. అఖండ 2 వాయిదా.. పవన్ ఓజీకి లైన్ క్లియర్ చేసినట్లైంది. సెప్టెంబర్ 12న తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్‌లో మిరాయి రిలీజ్ అవుతోంది. ఓ రేంజ్‌లో ఉన్న మిరాయి ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను డబుల్ చేశాయి. ఆ తర్వాత 13 రోజులకు 25వ తేదీన ఓజీ విడుదలవుతోంది. అంటే సరిగ్గా 2 వారాల తర్వాత. కాబట్టి.. థియేటర్లకు ఎలాంటి ఇబ్బందులు రావనేది టాలీవుడ్ వర్గాల మాట. దసరా రేస్ నుంచి అఖండ 2 తప్పుకోవటం ఓజీకి బాగా కలిసి వస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.