Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

హిందూపురంలో బాలయ్య సినిమా సీన్.. కౌన్సిలర్లతో కలిసి…!

హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తైన తర్వాత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చైర్మన్ ఎన్నిక ఆసాంతం సినీ ఫక్కీలోనే జరిగింది. చైర్మన్ గా రమేష్ ను ఎంపిక చేసిన బాలయ్య.. స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీ చైర్మన్ ఇంద్రజ రాజీనామా చేశారని బాలయ్య అన్నారు. వైసీపీతో విసిగి చెంది వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరారని ఎన్నికలకు ముందే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి వచ్చారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని స్పష్టం చేసారు.

Also Read : తాడేపల్లిలో వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్.. జగన్ కొత్త ప్లాన్…!

ప్రతి వార్డుకు మంచి నీటిని అందిస్తాం… కావాల్సిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ లో డంపింగ్ యార్డ్ ను మార్చి… క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తామన్నారు. హిందూపురం అభివృద్ధి కి కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని హిందూపురం ఎంతో భవిష్యత్తు ఉంది అన్నారు. కియా పరిశ్రమ రావడంతో… ఇటు హిందూపురం కు అనేక పరిశ్రమలు వస్తాయని తెలిపారు. హిందూపురం అభివృద్ధికి ఎప్పుడూ పాటుపడి ఉంటాయన్నారు. పద్మభూషణ్ అవార్డు వచ్చిన నటుడిగా నాకు సంతృప్తి కలగలేదన్నారు బాలయ్య.

Also Read : నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

పద్మభూషణ్ అవార్డు రావడం నాలో ఇంకా కసిని పెంచిందని తెలిపారు. నాకెవరూ చాలెంజ్ కాదు… నాకు నేనే ఛాలెంజ్ అన్న ఆయన ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇక హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి వైసీపీకి దూరం కావడంలో బాలయ్య కీలక పాత్ర పోషించారు. వైసీపీకి కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో.. మున్సిపల్ చైర్మన్ కుర్చీలో టీడీపీ కూర్చుంది. ఇక హిందూపురం మున్సిపల్ కార్యాలయానికి టిడిపి కౌన్సిలర్లతో కలిసి బాలయ్య చేరుకున్నారు. ఆయనతో పాటుగా ఎంపీ బీకే పార్థసారథి కూడా ఉన్నారు. బస్సులో టిడిపి కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళారు ఎమ్మెల్యే బాలకృష్ణ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్