ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సమయంలో సైకో అంటు బాలకృష్ణ సంబోధించారు. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బాలకృష్ణ గురించి నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో జరిగిన కాల్పుల వ్యవహారాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అప్పుడు బాలకృష్ణను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపాడారంటూ కొత్త కథలు కూడా అల్లుతున్నారు.
Also Read : ఆ ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైందా..?
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమను వైఎస్ జగన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. ఆ సమయంలో సినీ పరిశ్రమ తరఫున కొందరు నాటి సీఎంను కలిశారన్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే బాలకృష్ణ అసెంబ్లీలో జగన్ గురించి ప్రస్తావిస్తూ.. ఉన్నాడు కదా.. ఆ సైకో.. అంటూ వ్యాఖ్యానించారు. దీంతో గౌరవ శాసనసభలో ఇలా వ్యాఖ్యానించడం తప్పు అంటూ వైసీపీ నేతలు తెగ గగ్గొలు పెడుతున్నారు. వెంటనే రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని.. బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కూడా.
Also Read : అమ్మవారి ఆలయ అధికారులపై విమర్శలు..!
వైసీపీ నేతలకు టీడీపీ నేతలు, అభిమానులు ఘాటుగానే బదులిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గురివింద గింజను తలపిస్తున్నాయన్నారు. గురివిందకు తన నలుపు కనిపించదని.. ఇప్పుడు వైసీపీ నేతల పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. గతంలో చంద్రబాబు గురించిన నాటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి “ముం..” అంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని నిలదీస్తున్నారు. ఇక నారా లోకేష్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా అంటున్నారు. ప్రతిపక్ష నేత స్థానంలో చంద్రబాబు ఉన్న సమయంలోనే.. ఆయన ఎదురుగానే నాటి మంత్రి సీదిరి అప్పల్రాజు సభలోనే మెంటల్ పేషంట్ అంటూ వ్యాఖ్యానించారు. వీటిని గుర్తు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. ఆ రోజు మీరు చేసింది తప్పు అయితే.. ఈ రోజు బాలయ్య అన్న మాటలు కూడా తప్పే.. ఆ రోజు వైసీపీ నేతలు చేసింది రైట్ అయితే.. ఈ రోజు బాలయ్య చేసింది కూడా రైట్ అంటున్నారు. టీడీపీ నేతల కౌంటర్‌తో వైసీపీ నేతలు అంతా సైలెంట్ అయ్యారు.