పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత ఒకరి సినిమాకు మరొకరు ప్రచారం చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. ప్రమోషన్ విషయంలో పక్కా లెక్కలతో ఉంటున్నారు స్టార్ హీరోలు. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న మెగా నందమూరి హీరోలు.. ఒకరు సినిమాలకు ఒకరు ప్రచారం చేసుకోవడానికి రెడీ అయ్యారు. ప్రతి ఏటా సంక్రాంతి బరిలో విజయం సాధిస్తూ ఈసారి కూడా సంక్రాంతిని టార్గెట్ గా చేసుకున్న బాలకృష్ణ.. డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేశారు.
Also Read : త్రివిక్రమ్ తో స్టార్ట్ చేస్తాడా..? షాక్ ఇస్తాడా..?
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాతో ఇప్పటికే హీట్ పెంచాడు. రామ్ చరణ్ రాజమండ్రిలో ఈవెంట్ ప్లాన్ చేస్తే బాలకృష్ణ ఇప్పుడు డల్లాస్ లో తన సినిమా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అందుకే బాలయ్య డల్లాస్ లో ల్యాండ్ అయ్యారు. ఇదే వేదికపై సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ట్రైలర్ కట్ విషయంలో గేమ్ ఛేంజర్ టీం బాలయ్య టీం కి సపోర్ట్ చేస్తుందట.
Also Read : యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ రెడీ..!
సంక్రాంతి బరిలో నందమూరి మెగా కుటుంబాలు ఎప్పుడు పోటాపోటీగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఒక సినిమాకు ఒకరు హెల్ప్ చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ ట్రైలర్ ని గేమ్ ఛేంజర్ సినిమా ఎడిటర్ రూబెన్ కట్ చేశాడు. ట్రైలర్ కట్ చేసినందుకు డైరెక్టర్ బాబి సోషల్ మీడియాలో థాంక్స్ కూడా చెప్పాడు ట్రైలర్ కట్ ఒక రేంజ్ లో ఉందంటూ స్పెషల్ థాంక్స్ చెప్తూ పోస్ట్ చేశాడు. ఇప్పటికే బాలకృష్ణ గేమ్ చేంజర్ సినిమా యూనిట్ తో ఆహాలో ఒక ఎపిసోడ్ కూడా చేశారు.