Friday, September 12, 2025 08:50 PM
Friday, September 12, 2025 08:50 PM
roots

బాలయ్యను లైన్ లో పెడుతున్న హరీష్ శంకర్

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉన్నా సరే సరైన సినిమా తీయలేక ఇబ్బందులు పడుతున్నాడు హరీష్ శంకర్. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా అతని రేంజ్ కు తగ్గట్టు లేవు అనే క్లారిటీలు చాలామందికి ఉన్నాయి. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా చాలా దారుణంగా ఆడింది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమాపై ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న హరీష్ శంకర్ ఆ సినిమాకు గ్యాప్ రావడంతో… ఈ టైం లో వేరే హీరోలతో సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

Also Read : ఎన్టీఆర్ – నీల్ స్టార్ట్ అవుతుంది.. మొదటి షెడ్యూల్ అక్కడే..!

ఈ టైంలోనే మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేసి రవితేజను కూడా ఒకరకంగా ఇబ్బంది పెట్టాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా మరింత ఆలస్యం కావడంతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. నందమూరి బాలకృష్ణ హీరోగా… ఒక కథను రెడీ చేసి పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఇంకా 9 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉండటంతో… ఆ గ్యాప్ ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదని కాబట్టి ఈ టైంలో ఖాళీగా ఉండవద్దని భావిస్తున్న హరీష్ శంకర్.. ఈ సినిమా లైన్ చేసుకున్నాడు.

Also Read : చంద్రబాబు వ్యాఖ్యలపై కేడర్ అసంతృప్తి..!

ప్రస్తుతం అఖండ సీక్వెల్ తో బిజీగా ఉన్న బాలకృష్ణకు కూడా ఈ కథ వినిపించాడు హరీష్ శంకర్. దీనిపై బాలకృష్ణ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అఖండ సినిమా నుంచి హిట్ ట్రాక్ లో వచ్చిన బాలకృష్ణ.. స్టోరీ లైన్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. గతంలో మాదిరిగా ఏ కథ పడితే ఆ కథ సెలెక్ట్ చేసుకోవడం లేదు. మరి ఇప్పుడు హరీష్ శంకర్ స్టోరీని ఫైనల్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్