ఏపీ లిక్కర్ స్కాంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసిన అధికారులు.. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. లిక్కర్ స్కాం కేసులో బాలాజీ గోవిందప్పను ఎసిబి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.. బాలాజీ గోవిందప్ప లిక్కర్ స్కాం సిండికేట్లో కీరోల్ పోషించారని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కింగ్ పిన్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి బాలాజీ గోవిందప్ప అత్యంత సన్నిహితుడని ప్రస్తావించారు.
Also Read : పాత ఫార్ములాకు దుమ్ము దులుపుతున్న జగన్..!
మద్యంలో ప్రధాన బ్రాండ్స్ నిలిపివేసి తమ అనుకూలమైన బ్రాండ్స్ మార్కెట్లోకి విడుదల చేయడంలో ఇతని పాత్ర ఉందని.. సొంత బ్రాండ్స్ మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలను వీళ్ళంతా కలసి కొల్లగొట్టారని పేర్కొన్నారు. సిండికేట్ లొ బాలాజీ గోవిందప్ప కీరోల్ పోషించారనీ నాటి APBCL అధికారులయిన సత్య ప్రసాద్,వాసుదేవ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారని వివరించారు. అనుకూలమైన కంపెనీల ద్వారా లిక్కర్లో ఎలా ఆర్డర్స్ పెట్టాలో ఆదేశాలు ఇచ్చే వాళ్ళని పేర్కొన్నారు.
Also Read : పెద్దిరెడ్డి టార్గెట్ గా పవన్ సంచలన అడుగులు
డిస్టిలరీల ద్వారా సప్లయర్స్ ద్వారా వచ్చిన కమీషన్లు మొత్తం బాలాజీ గోవిందప్పకు చేరాయని.. లిక్కర్ ద్వారా వచ్చిన మొత్తాన్ని వీరంతా కలసి వివిధ రూపాల్లో మళ్లించారని తెలిపారు. ఆయా డబ్బులతో స్థిర ఆస్తులు,లక్జరి కార్లు,కొనుగోలు చేశారన్నారు. బాలాజీ గోవిందప్పకు డబ్బు ఎలా మళ్లించాలీ అనేది మొత్తం తెలుసని.. ఇలాంటి కేసుల్లో 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు. బాలాజీ గోవిందప్ప దేశం విడిచి వెళ్ళే అవకాశం ఉందని.. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. రిమాండ్ విధించాలని కోరిన సిట్ అధికారులు.. లిక్కర్ కేసులో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఎంత మేరకు ఉంది విచారణ చేయాలని కోర్ట్ ను కోరారు. లిక్కర్ స్కాంలో వచ్చిన మొత్తాన్ని కిక్ బ్యాగ్స్ ద్వారా మళ్లించారన్నారు.