Friday, September 12, 2025 07:11 PM
Friday, September 12, 2025 07:11 PM
roots

మంత్రులకు సీఎం భయం.. సచివాలయం వదలట్లేదు..!

2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే కేటాయించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అసలు ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎప్పుడూ సచివాలయానికి వెళ్ళిన పరిస్థితి దాదాపుగా లేదని చెప్పాలి. దీనిపై ఎన్నోసార్లు విమర్శలు వచ్చిన సరే కనీసం సచివాలయం మెయిన్టెనెన్స్ కూడా పట్టించుకోలేదని ఉద్యోగులు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా మారిందనే చెప్పాలి. మంత్రులందరూ ఎక్కువగా సచివాలయంలోనే ఉంటున్నారు.

Also Read: నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

క్యాంప్ ఆఫీస్ కంటే సచివాలయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవాడలో ఉంటే ప్రతి మంత్రి సచివాలయానికి వెళ్లడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాత్రి 8 గంటల వరకు ఎక్కువగా సచివాలయంలోనే ఉంటున్నారు. అలాగే మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పలు కంపెనీల అధినేతలు లేకపోతే శాఖా పరమైన సమీక్షలతో ఎక్కువగా సచివాలయంలోనే గడుపుతున్నారు. సచివాలయానికి రాజకీయ నాయకుల తాకిడి కూడా చాలా తక్కువగా కనబడుతోంది. అప్పుడప్పుడు మినహా పెద్దగా రాజకీయ నాయకులు కూడా సచివాలయం వైపు చూడటం లేదు.

Also Read: వైసీపీకి మరో ఎదురు దెబ్బ..?

ఏదైనా రాజకీయ సమస్యలు ఉంటే క్యాంప్ ఆఫీస్ వద్దనే తేల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు… మినహా సచివాలయం వరకు రాజకీయాలను తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం లేదు. ఇక ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్ళినా సరే తమకు ఏదైనా పని ఉంటే మాత్రమే సచివాలయానికి వెళ్లడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి సచివాలయంలో ఎక్కువగా ఉండటంతో మంత్రులు కూడా జాగ్రత్త పడుతున్నారు. గతంలో కంటే చంద్రబాబు ఈసారి కాస్త భిన్నంగా ఉండటంతో ఆయన ఆగ్రహానికి గురి కాకూడదు అనే భయమో మరేదైనా కారణమో తెలియదు గానీ ఎక్కువగా మంత్రులు మాత్రం సచివాలయం పరిసరాల్లోనే తిరుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. ఆ తర్వాత కూడా ఎక్కువగా సచివాలయంలోనే కనబడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్