Wednesday, February 4, 2026 06:30 PM
Wednesday, February 4, 2026 06:30 PM

ఎమ్మెల్యేలకు అయ్యన్న మాస్ వార్నింగ్..!

వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సభకు వస్తారా.. రారా అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై అధికారులతో స్పీకర్ సమీక్ష చేశారు. సెప్టెంబర్ 17 లేదా 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని స్పీకర్ తెలిపారు. అయితే సమావేశాల సమయంలో వైసీపీ నేతలకు స్పీకర్ కీలక సూచనలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు రావాలని సూచించారు.

Also Read : లోకేష్ రివేంజ్ అదుర్స్, వైసీపీ జర్నలిస్ట్ ప్రశంసలు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు అయ్యన్న. అలాగే ప్రతి సభ్యుడు కూడా తమ నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. సభలో ఆయా పార్టీలకు కేటాయించే సమయంపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని.. వాటిని తప్పకుండా పాటిస్తామన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు.

వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తారో.. రారో.. ముందే స్పష్టత ఇవ్వాలన్నారు అయ్యన్న. వైసీపీ సభ్యులు సభకు రాకుండా.. ప్రశ్నలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రశ్నలు వేయడం వల్ల సభా సమయం వృధా అవుతుందన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తాలకు ప్రశ్నలు పంపిస్తామంటే ఇకపై అనుమతి ఇచ్చేది లేదన్నారు. సభకు వస్తే వైసీపీకి 2 ప్రశ్నలు కేటాయిస్తామన్న అయ్యన్న… లేకపోతే.. ఆ రెండు ప్రశ్నలు కూడా ఇతర పార్టీలకే కేటాయిస్తామన్నారు.

Also Read : ఈ ప్రజాస్వామ్యవాదులు అప్పుడు ఎక్కడ..?

గతంలో కూడా వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సభకు రాకుండా.. దొంగల్లా వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతున్నారని.. ఇలా దొంగల్లా రావటం ఏమిటని అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఇప్పటి వరకు ఎలాంటి జవాబు చెప్పలేదు. ఇప్పుడు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సీరియస్‌గా తీసుకుని సభకు వస్తారో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్