ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర ఫాంతో ఇబ్బందులు పడ్డ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలో సైతం అదే ప్రదర్శనతో చికాకు పెట్టించాడు. రోహిత్ కోసం 17 ఏళ్ల ఆయుష్ మ్హత్రే అనే ఆటగాడ్ని పక్కన పెట్టగా.. రోహిత్ కనీస ప్రభావం కూడా చూపించలేదు. ఆయుష్ 6 మ్యాచ్‌ల్లో 40.09 సగటుతో 441 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో నిలకడగా ఆడుగుతున్నాడు. అయితే జాతీయ జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్ళు.. రంజీ జట్టులో చేరడంతో.. అతన్ని పక్కన పెట్టారు. ఇక జైస్వాల్ కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు.
Also Read : అవినాష్ రెడ్డి ని అడ్డంగా బుక్ చేసిన విసారెడ్డి
జమ్మూ & కాశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రోహిత్ బ్యాట్‌తో విఫలం కావడమే కాకుండా.. ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. రోహిత్ మాత్రమే కాదు, రంజీ ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న ఇతర సీనియర్ భారత స్టార్లు కూడా ఫ్లాప్ షో చేసారు. యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కెప్టెన్ అజింక్యా రహానే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వీరి సంగతి పక్కన పెడితే రోహిత్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే డిమాండ్ వినపడుతోంది.
Also Read : పోర్ట్ వాటాల కక్కుర్తి ముంచేసిందా..? కెవి రావు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటీ..?
ఓ పక్క యువ ఆటగాళ్ళు తుది జట్టులో చోటు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. 38 ఏళ్ళ రోహిత్ శర్మ.. కెప్టెన్ గా, ఆటగాడిగా కూడా స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించడం లేదు. బోర్డు రంజీలు ఆడాలనే కండీషన్ పెట్టినా.. ఇక్కడ కూడా అతని ఆట తీరు మెరుగ్గా లేదు. ఇక అతనిలో ఆడాలనే పట్టుదల ఉన్నా సరే ఒత్తిడిలో ఉన్నాడని.. అందుకే యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలని కోరుతున్నారు.