భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ అనగానే ఎన్నో అంచనాలు, లెక్కలు ఉంటాయి. గత ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓడిపోవడంతో ఈ నెల 19 నుంచి జరగబోయే వన్డే సీరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ 5 టి20లు కూడా ఆడనుంది. అయితే ఈ సీరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా సీరీస్ నుంచి తప్పుకుంటున్నాడు. అక్టోబర్ 19 నుండి భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు అతను తప్పుకుంటున్నాడు అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
Also Read : రంగంలోకి జగన్.. క్యాడర్ తో మరో కీలక సమావేశం
దీనితో అతని స్థానంలో క్వీన్స్‌ల్యాండ్ బ్యాట్స్‌మన్ మాథ్యూ రెన్‌షాను తిరిగి జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా అతను తప్పుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో యాషెస్ సీరీస్ కూడా ఉండటంతో.. అతనికి రెస్ట్ ఇచ్చారు. రేన్ షా 2022లో జరిగిన వన్డే జట్టుకు ఎంపిక అయినా సరే.. ఇంకా అరంగేట్రం చేయలేదు. కమిన్స్ గైర్హాజరీతో.. అనుభవజ్ఞులైన మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ పేస్ అటాక్ కు నాయకత్వం వహిస్తారు. జేవియర్ బార్ట్ లెట్, బెన్ డ్వార్షుయిస్ లు కూడా పేస్ బౌలర్ లుగా ఎంపిక అయ్యారు.
Also Read : డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు
గత సీజన్‌లో క్వీన్స్‌ల్యాండ్ తరఫున రెన్ షా అద్భుతంగా రాణించాడు,. 50 సగటుతో 350 పరుగులు చేశాడు. ఇటీవల శ్రీలంక ఏపై 80, 106, 62 లతో రాణించాడు. వన్డేల తర్వాత ఐదు టీ20లు జరుగుతాయి, మొదటి రెండు టీ20లకు ఆస్ట్రేలియా 14 మందితో కూడిన జట్టును కూడా ప్రకటించింది. మొదటి వన్డే అక్టోబర్ 19న పెర్త్ లో జరగనుంది. రెండవ వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ లో మూడవ వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరుగుతాయి. కాగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ కూడా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.