Wednesday, February 4, 2026 08:23 AM
Wednesday, February 4, 2026 08:23 AM

అరబిందోకి మూడింది, రంగంలోకి సిఐడీ, పవన్ హడావుడి వర్కౌట్ అయిందా…?

ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ పోర్ట్ నుంచి అక్రమ వ్యవహారాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి అక్రమ రేషన్ దందాపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా పలు షిప్స్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యం వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు. దీనితో పోర్ట్ నిర్వహణ వ్యవహారాలపై ఇప్పుడు సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేసింది.

Also Read : బూమ్రా గొప్పతనం నా మనవళ్ళకు చెప్తా: ట్రావిస్ హెడ్

కాకినాడ పోర్ట్ లో అరబిందో సంస్థ గుత్తాధిపత్యం కొనసాగుతుందని సర్కార్ గుర్తించింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై ఓ రహస్య నివేదికను సిద్దం చేసి… సోమవారం చంద్రబాబుతో భేటీలో అందించారు. పోర్ట్ లో జరుగుతున్న కొన్ని అక్రమ వ్యవహారాలకు నిర్వహణ సంస్థకు లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో సిఐడీ రంగంలోకి దిగింది. వైసిపి ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని 41.12 శాతం వాటాను.. బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసారు.

Also Read : తిరుమలలో ముంతాజ్ హోటల్ రగడ, స్వామీజీల డిమాండ్ ఏంటీ…?

నాటి ప్రభుత్వ పెద్దలు వాటాదారు మెడపై కత్తిపెట్టి, సింహభాగం వాటాను అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (అంతకు ముందు దీని పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ )కు అప్పగించేలా చేశారనేది ఈ ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టనున్నారని సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్