ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు అరెస్ట్ అయ్యే అవకాశం లేదని భావించిన ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో దర్యాప్తు బృందాలు గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నాయకులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. కీలక నాయకులు పెద్ద ఎత్తున అరెస్టు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. తాజాగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని మరిది విడుదల గోపి అరెస్టు అయ్యాడు.
Also Read : అందుకే దువ్వాడపై వేటు.. ఆ మాటే జగన్‌కు నచ్చలేదు..!
ఇక లిక్కర్ కుంభకోణం విషయంలో కీలక నిందితుడుగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, సహా పలువురు ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. తనను అరెస్టు చేసే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేసిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులును సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఓ కీలక నేతను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
Also Read : నీటి నుంచి క్రికెట్ వరకు.. పాకిస్తాన్ కు మోడీ షాక్
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసిన తర్వాత… ఎక్కువగా వినపడిన పేరు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత కొన్ని రోజుల నుంచి అంబటి రాంబాబు కాస్త ఎక్కువగా రెచ్చిపోతున్నారు. దీనితో ఆయనపై కూడా కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అరెస్టు చేయవచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై కూడా గురి పెట్టారు. ఆయన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు పలు నివేదికలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే వారి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.