వచ్చే ఏడాది మార్చ్ నాటికి మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలనే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా లక్ష్యం నెరవేరుతుందా..? మావోయిస్ట్ లు ఆత్మరక్షణలో పడ్డారా..? తమ అగ్ర నేతలను కోల్పోతున్న మావోయిస్ట్ లు.. ప్రాణ రక్షణపైనే దృష్టి సారించారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంఖ్య భారీగా తగ్గిపోయింది. కీలక అగ్ర నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. ఆయుధ నిల్వలు కూడా భారీగా తగ్గిపోవడం, రిక్రూట్మెంట్ కూడా ఆగిపోవడం మావోయిస్ట్ పార్టీని కలవరపెడుతోంది.
Also Read : వర్షా కాలానికి జీర్ణ వ్యవస్థకు సంబంధం ఏంటీ..?
తమ చీఫ్ బసవరాజ్ మరణం తర్వాత మావోయిస్ట్ అగ్ర నేతలు లొంగిపోయే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తిప్పిరి తిరుపతి, గణపతి వంటి నేతలు కూడా తమ క్యాడర్ కు లొంగిపోవాలని సూచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఆత్రం దంపతులు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మరో కీలక నాయకుడి దంపతులు కూడా లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వయసు మీద పడటం, మునుపటిలా భద్రత లేకపోవడం, అనారోగ్యం, భద్రతా దళాల దాడులు, మొత్తంగా సీనియర్ మావోయిస్టులు లొంగుబాటు కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేసారు.
Also Read : రోహిత్ – కోహ్లీ రిటైర్మెంట్ పై బోర్డ్ సంచలన కామెంట్స్
ప్రస్తుతం తీవ్రంగా నష్టపోయిన..సంక్షోభ పరిస్థితుల్లో.. అనారోగ్యంతో బాధపడుతున్న వారు.. 70 ఏళ్లకు చేరువలో ఉన్నవాళ్ళు.. అంతకు మించి వయసున్న వాళ్లను కాపాడుకోవడం కూడా కష్టంగా మారడంతో… వాళ్ళని లొంగిపోవాలని అగ్ర నాయకత్వం సూచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆత్రం లచ్చన్న దంపతులు రామగుండం కమిషనర్ ముందు లొంగిపోగా, లొంగిపోవటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ మరో మావోయిస్ట్ జంట రామకృష్ణ అరుణ.. ఏపీ పోలీసులను కలిసినట్లు సమాచారం. అయితే వీరు ఇప్పటికే ఏపీ పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.