వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా చెలరేగిపోయిన… రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అనీల్ దౌర్జన్యం చేసాడనే అభియోగాలపై అతన్ని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల ఓ కేసులో గుంటూరు వచ్చిన సందర్భంగా అనీల్ పోలీసులను బిర్యాని పెట్టాలని డిమాండ్ చేయగా… పోలీసులు అందుకు నిరాకరించారు. మేస్ భోజనమే పెడతామని స్పష్టం చేసారు. కాని బుధవారం మాత్రం బిర్యాని పెట్టి తీసుకు వెళ్ళారు.
Also Read : పుష్ప ప్రమోషన్స్ మరీ ఈ రేంజ్ లోనా…?
అది కూడా ఓ ఫేమస్ రెస్టారెంట్ లో ఈ తంతు జరిగింది. గన్నవరం క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ లో అనీల్ కు భోజనం పెట్టించారు. అతను ఓ ఎమ్మెల్యే రేంజ్ లో రెస్టారెంట్ లో కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. బయటకు వచ్చిన సీసీ ఫూటేజ్ లో అతని నడక చూస్తే క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రతిపక్షంలోనూ అధికార లాంచనాలు, ధర్మాసనం రిమాండ్ విధించిన ఖైదీకి విందులు విలాసాలు ఏంటీ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లా&ఆర్డర్స్ అసలు పని చేస్తున్నాయా అంటూ ప్రశ్నలు వేసారు నెటిజన్లు.
Also Read : పోలవరం విషయంలో కీలక ముందడుగు
రిమాండ్ విధించిన ఖైదీని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే తరుణంలో పోలీసు వారి అలసత్వం వెనుక భయమా లేక మరేదైనా కారణమా అనే ప్రశ్నలు వినిపించాయి. అసలే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువై ఒకదానిపై ఒకటి నేరాలు జరుగుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అనీల్ కు జరిగిన మర్యాదలు చూస్తే… అసలు నేరస్తులకు ధర్మాసనం విధించిన శిక్షలు అమలు జరిగేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టడంపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అక్కడే ఉన్న టిడిపి కార్యకర్తలు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉండగా వాళ్ల ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేసారు పోలీసులు. ఆ తర్వాత రెస్టారెంట్ యాజమాన్యం సీసీ ఫూటేజ్ రిలీజ్ చేసింది. దీనితో అక్కడ అలసత్వం వహించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.