Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

జగన్‌కు పోలీసు దెబ్బ రుచి తప్పదా..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో ఓసారి బయటకు వచ్చే జగన్.. ఏదో అనాలని అనుకుని.. మరేదో అనేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్త వైరల్‌గా మారుతుంది. చివరికి ఈ విషయం వైసీపీ నేతలందరికీ తలనొప్పిగా మారుతుంది. ఇలా తొలిసారి కాదు.. ఓడిన తర్వాత ఈ పది నెలల్లో జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా సరే.. ఇదే తలనొప్పి అంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన ప్రతిసారి ఏదో ఒక మాట అనేసి వెళ్లిపోతున్నారు తప్ప… జగన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో జగన్ పర్యటించారు. ఆ సమయంలో ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల కొంప ముంచుతోంది.

Also Read : బీ కేర్ ఫుల్.. జగన్‌కు మాస్ వార్నింగ్..!

పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. మీకు అండగా ఉంటా అంటూ హామీ ఇచ్చారు. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడటం మొదలుపెట్టారు. లింగమయ్యది రాజకీయ హత్య అంటూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేశారు. అంత వరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడే జగన్‌లో సహనం నశించింది. అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు… జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే సీఎం సీఎం అంటూ గోలగోల చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన జగన్.. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బట్టలూడదీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. బజారులో పరిగెత్తిస్తామంటూ తీవ్ర పదాలు వాడారు. ఉద్యోగం నుంచి పీకేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు 

జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం పోలీస్ వ్యవస్థనే కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రామగిరి ఎస్సై సుధాకర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. బట్టలూడదీస్తా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. ఇక ఏపీ పోలీసు అధికారుల సంఘం కూడా జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బట్టలూడదీస్తా అంటూ జగన్ వ్యాఖ్యానించడాన్ని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. తీవ్ర ఒత్తిడితో పని చేస్తున్న పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటా న్యాయపోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని జగన్ మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.

Also Read : 2019 వ్యూహమే జగన్ ప్లాన్ చేసారా..? చింతమనేని అలెర్ట్ గా ఉండాల్సిందే

జగన్ చేసిన వ్యాఖ్యలతో పోలీసులు ఎదురు తిరగడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరు పోలీసు అధికారుల అండతోనే ఐదేళ్ల పాటు ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్‌లోనే పంచాయతీలు చేశారు. ఇక గతంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా పోలీసులపై విమర్శలు చేసినప్పుడు.. నాడు సీఐగా విధుల్లో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. యూనిఫామ్ జోలికి వస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో వైసీపీ నేతలంతా మాధవ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో చివరికి జగన్ కూడా హిందూపురం ఎంపీ టికెట్‌ గోరంట్ల మాధవ్‌కు ఇచ్చారు. మరి ఆ రోజు గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అయితే.. ఈ రోజు ఎస్సై సుధాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే… అప్పుడు మాధవ్ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు సుధాకర్ వీడియోలు పక్కపక్కనే పెట్టి.. పోలీసు పవర్ అంటే ఇదే అంటూ పోస్టులు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్