వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. వైసీపీలో ప్రభుత్వంలో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డిని ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల క్రితమే వాసుదేవరెడ్డిని పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మద్యం మాఫియాకు అండగా ఉన్నాడనే కారణంతో వాసుదేవరెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడనే ఆరోపణలతో ఎండీ పదవి నుంచి ఈసీ తప్పించింది. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే బెవరేజస్ కార్పొరేషన్‌లో ఆధారాలను ధ్వంసం చేశారనే కేసులు పెట్టారు. దీంతో ఆయన నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు.
Also Read : బాలయ్యను లైన్ లో పెడుతున్న హరీష్ శంకర్
7 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐడీ అధికారులతో పాటు ఐపీఎస్ ఘట్టమనేని శ్రీనివాస్ కూడా వచ్చాడనేది ప్రధాన ఆరోపణ. వాసుదేవరెడ్డిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారనేది కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు పేర్లు చెప్పాలని వాసుదేవరెడ్డిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని… ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read : కేటిఆర్ కు ఒకే రోజు రెండు షాక్ లు…!
మరోవైపు వాసుదేవరెడ్డిపై సీఐడీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో తనపై దాఖలైన కేసుపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వాసుదేవరెడ్డి. ఈ సమయంలోనే వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వాసుదేవరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా జగన్ నియమించారు. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం షాపులను ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. అలాగే రకరకాల బ్రాండ్ల మద్యం కూడా వాసుదేవరెడ్డి హయాంలోనే వచ్చినట్లు టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. అలాగే మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్ పేమెంట్ లేకుండా… కేవలం నగదు మాత్రమే అమలు చేయడం ద్వారా భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజున కీలకమైన డాక్యుమెంట్లు మాయం చేశారనేది వాసుదేవరెడ్డిపై ప్రధాన ఆరోపణ. కేసు నమోదు చేయడంతో నాటి నుంటి వాసుదేవరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.