Friday, September 12, 2025 07:08 PM
Friday, September 12, 2025 07:08 PM
roots

యోగాంధ్ర.. ఏపీ బ్రాండ్.. రికార్డుల మోత..!

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచానికే తల మానికం. ఇప్పటి వరకు ఎన్నడూ లేనట్లుగా ఒకేసారి 5 లక్షల మందితో ఏకకాలంలో యోగా నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. 2015లో తొలిసారి యోగా డే నిర్వహించారు. నాటి నుంచి ప్రతి ఏటా యోగా డే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది విశాఖలో గ్రాండ్‌గా నిర్వహిస్తోంది ఏపీ సర్కార్.

Also Read : బాబోయ్.. నాకేం సంబంధం లేదు..!

బీచ్ రోడ్డులో భారీ వేదిక నిర్మిస్తున్నారు. సముద్ర తీరంలో చల్లని గాలిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 5 లక్షల మందితో యోగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒక మ్యాట్ కేటాయిస్తారు. దానికి జియో ట్యాగింక్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ యోగా మెగా ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికేట్ కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

యోగాంధ్ర కార్యక్రమంపై ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున దృష్టి సారించింది. విశాఖ బీచ్ రోడ్డులో వాకథాన్ నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాకథాన్‌లో మంత్రులు, అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో కలిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు.

Also Read : అణు యుద్దమేనా..? వెనక్కు తగ్గని ఇరాన్

యోగాంధ్రతో విశాఖ బ్రాండ్‌ను మరింత పెంచాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఏపీ బ్రాండ్ పెరగాలంటే ముందుగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసమే ఇప్పటికే విజయవాడలో మెగా డ్రోన్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించడం ద్వారా యోగాంధ్రకు గుర్తింపు వస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచ రికార్డులపై ప్రభుత్వం గురి పెట్టింది. సాగర తీరంలో ఏకకాలంలో 5 లక్షల మంది యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో సూరత్‌లో లక్షా 87 వేల మంది ఒకేసారి యోగాసనాలు వేశారు. దీనిని తిరగరాసేందుకు కూటమి సర్కార్ మెగా ఈవెంట్ ప్లాన్ చేసింది.

Also Read : రప్ప రప్ప ఎవరిని నరుకుతావ్ జగన్..? పయ్యావుల అదిరిపోయే కౌంటర్

ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 3 లక్షల 26 వేల మందికి ఏర్పాట్లు చేశారు. అలాగే 25 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్యనమస్కారాలు చేసేలా ప్లాన్ చేశారు. ప్రధాని సమక్షంలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయనున్నారు. ఏఐ టెక్నాలజీ, డ్రోన్‌లతో లెక్కించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి యోగాంధ్ర 2025 విశాఖ నగరానికే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్