ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కొన్ని పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అరెస్ట్ లు మొదలైన దగ్గరి నుంచి.. విచారణ, కోర్ట్ లో వాదనలు మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి. తాజాగా లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. నలుగురి కస్టడీ పిటిషన్ పై తదుపరి విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్ట్. వేరు వేరుగా సిట్ కస్టడీపై వాదనలు వినిపించారు నిందితుల తరపు న్యాయవాదులు.
Also Read : వైసీపీకి మరో షాక్ సిద్ధం..?
లిక్కర్ కేసుతో సంబంధం లేని వారిని నిందితులుగా చేర్చి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని కోర్టు దృష్టికి నిందితుల తరపు న్యాయవాదులు తీసుకు వెళ్ళారు. బాలాజీ గోవిందప్పను కేసులో నిందితుడిగా అక్రమ కేసులు పెట్టారని కోర్ట్ ముందు వాదనలు వినిపించారు. APBCL కు ఏ మాత్రం ప్రమేయం లేని గోవిందప్ప బాలాజీనీ నిందితుడిగా చేర్చారని.. లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టీ రిమాండ్, కస్టడీ ఇవ్వాలంటూ ఎసిబి కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి నిందితుల తరపు న్యాయవాదులు తీసుకు వెళ్ళారు.
Also Read : పవన్ ప్లానింగ్ అదుర్స్.. త్వరలో మరో కార్యక్రమం
ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలను తప్పుడు స్టేట్ మెంట్లు పెట్టీ నిందితులుగా చేర్చారని, ఆదేశాలు అమలు చేసిన వారిని నిందితులుగా చేర్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కేసులో ఎవరో, ఎప్పుడో స్టేట్మెంట్ ఇస్తే దానిని బేస్ చేసుకొని మెమోలు దాఖలు చేసి నిందితులుగా చేరుస్తున్నారని, తమ క్లైంట్ లకు లిక్కర్ స్కాంకు ఏ సంబంధం లేదని వాదించారు. 161 స్టేట్మెంట్ తో నిందితులు అంటే సరిపోతుందా పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు ఎవరి ప్రమేయం లేదని.. పరోక్షంగా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలనే అమలు చేసారనే విషయాన్ని కోర్ట్ కు వివరించారు. ఇరు వర్గాల వాదనల విన్న అనంతరం తదుపరి విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది కోర్ట్.