Saturday, October 25, 2025 09:51 AM
Saturday, October 25, 2025 09:51 AM
roots

పవన్ కు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమా ప్రమోషన్ లో.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారని, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని.. మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ హైకోర్టులో గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. అధికారులతో పాటుగా ప్రభుత్వ వాహనాలను కూడా వినియోగించారని ఆరోపణలు వచ్చాయి.

Also Read : కేంద్ర కేబినెట్ లోకి జనసేన ఎంపీ…?

దీనిపై విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారిక వాహనాలను, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న దీనిపై విచారణ చేయాలని పిటిషన్ ను స్వీకరించింది. పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి అనైతికం, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరారు.

Also Read : లిక్కర్ కేసులో మిధున్ రెడ్డి ఫ్రెండ్స్ కీ రోల్..?

పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి.. జస్టిస్ జ్యోతిర్మయ ప్రతాప.. పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపారు. దీనితో పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై వైసీపీ కూడా గతంలో విమర్శలు చేసింది. పవన్ కళ్యాణ్ అధికారులు మొత్తాన్ని సినిమా షూటింగ్ ప్రాంతానికి పిలుస్తున్నారని ఆరోపించింది. ఇక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై.. ప్రభుత్వ న్యాయవాది తప్పు పట్టారు. ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని, అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్