Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

ఇక లాభం లేదు.. లిక్కర్ స్కాం విషయంలో సర్కార్ సంచలనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసే సంకేతాలు కనబడుతున్నాయి. లిక్కర్ కుంభకోణం విషయంలో ఇప్పుడు దర్యాప్తు అధికారులు పలువురు కీలక వ్యక్తులను విచారించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటుగా మిథున్ రెడ్డిని కూడా విజయవాడలో విచారించారు. వీరిద్దరినీ ఏ ఏ కోణంలో విచారించారు అనేదానిపై అధికారులు క్లారిటీ ఇవ్వకపోయినా పలు కీలక ప్రశ్నలు మాత్రం వీరికి సంధించినట్లు తెలుస్తోంది. ఇక్కడ విజయసాయిరెడ్డి వాంగ్మూలమే అత్యంత కీలకం కానున్న అంశం.

Also Read : వైసీపీలో దర్శకత్వ సమస్య.. జగన్ డైరెక్టర్ ఎవరో..?

అయితే ఇక్కడ దర్యాప్తు అధికారులకు రాజ్ కసిరెడ్డి చుక్కలు చూపిస్తున్నాడు. నాలుగుసార్లు అధికారులు నోటీసులు జారీ చేసిన సరే ఇప్పటివరకు అతను విచారణకు హాజరు కాలేదు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అతను దాఖలు చేశాడు. న్యాయస్థానాలు చెప్పిన సరే విచారణకు హాజరయ్యేందుకు రాజ్ కసిరెడ్డి ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ కేసును జాతీయ దర్యాప్తు బృందాలకు అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Also Read : ఎంపీ పదవి ఆయనకే.. కూటమిలో క్లారిటీ..!

ఒకవేళ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దేశం దాటి వెళ్ళిపోతే.. అతని తీసుకొచ్చే బాధ్యతను సిబిఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థలు తీసుకుంటాయి. దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అతను దేశంలోకి రావడం పెద్ద విషయం కాదు. ఇక అతని పాస్పోర్ట్ కూడా రద్దు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడింది. ఈ అంశానికి సంబంధించి పలు కీలక సాక్షాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వాటి ఆధారంగా కేసును జాతీయ దర్యాప్తు బృందాలకు అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్