Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

విశాఖలో మెట్రో పరుగులు..!

విశాఖ నగర అభివృద్ధికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీసీఎస్ వంటి మెగా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక విశాఖ కేంద్రంగా ఇప్పటికే కేంద్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా ఇప్పటికే ప్రకటించింది. దీని పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏపీకి విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ఇప్పటికే పేరు. దీంతో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని.. అలాగే విశాఖ వాసులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కూటమి ప్రభుత్వం నడుం బిగించింది.

Also Read : టీడీపీలో నం.3 ఎవరో తెలుసా..?

విశాఖ నగరానికి కూటమి సర్కార్ గతంలోనే మెట్రో రైలు మంజూరు చేసింది. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ 2014లోనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా అప్పట్లోనే డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. అయితే 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేసిన వైసీపీ.. అందుకు కావాల్సిన మౌలిక వసతులు మాత్రమే కల్పించలేదు. విశాఖ నగరానికి అవి చేస్తాం.. ఇవి చేస్తామని గొప్పగా ప్రకటించిన వైసీపీ నేతలు.. భూ కబ్జాలకు పాల్పడ్డారు. అలాగే రుషికొండలో జగన్ కోసం ఓ బడా ప్యాలెస్ నిర్మించారు. అంతే తప్ప ప్రజల కోసం కనీసం ఒక్క పని కూడా చేయలేదు.

Also Read : టీడీపీ సోషల్ మీడియాకు గుర్రంపాటి బెదిరింపులు

అయితే కూటమి సర్కార్ కొలువుతీరిన తర్వాత పాత దస్త్రాల దుమ్ము దులిపింది. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక రాజధాని విశాఖ నగరం మరింత విస్తరిస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. భవిష్యత్ అవసరాల కోసం మెట్రో రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖలో 3 కారిడార్లను నిర్ణయించింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్లానింగ్,టెండర్ల ప్రక్రియ,పనుల పర్యవేక్షణ,ప్రాజెక్ట్ పూర్తికి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ టెండర్లు పిలిచింది.

Also Read : జగన్ ధనదాహానికి దేవుడిచ్చిన అన్న బలి..!

మెట్రో విశాఖ ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశాన్ని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహించింది. ఇందులో పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఈ సమావేశానికి మొత్తం 28 దేశీయ,విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్ 8 వరకు టెండర్ల దాఖలుకు గడువిచ్చారు. జూన్ 9న టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేయనుంది. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కానుంది. వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరుపుతోంది ఏపీ సర్కార్. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తం 42 మెట్రో స్టేషన్లు ఈ మార్గంలో ఉంటాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్