మాజీ మంత్రి విడుదల రజనీపై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం.. వెనక్కు తగ్గిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విడదల రజిని.. గ్రానైట్ వ్యాపారులను స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించాలని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… కొంతమంది ఆమెపై ఫిర్యాదులు చేశారు. దీనిపై ఏసీబీ అధికారులు ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి.. ఇటీవల గవర్నర్ కు లేఖ రాశారు.
Also Read : తిట్టిన వారికే పదవులు.. ఇదెక్కడి లాజిక్..!
ఆమె మాజీ మంత్రి కావడంతో విడదల రజనీపై కేసు నమోదు చేసేందుకు.. తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయంలో మళ్ళీ అధికారులు సైలెంట్ అయిపోయినట్లుగానే కనబడుతోంది. అటు గవర్నర్ కార్యాలయం కూడా దీనిపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే సమయంలో విడదల రజిని కూడా స్టోన్ క్రషర్ యజమానులతో రాజీకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వారికి డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో వార్తలు వినపడుతున్నాయి.
Also Read : పిల్లను ఇచ్చా అంతే.. జగన్ పై సాయి రెడ్డి సంచలనం
అలాగే కొంతమంది గ్రానైట్ యజమానులకు కూడా తిరిగి డబ్బులు ఇచ్చేస్తానని.. ఆమె ఒప్పందం చేసుకున్నట్లు కూడా సమాచారం. దీనితో కేసు వెనక్కు తీసుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నీ మధ్య కాస్త మీడియాలో హడావుడి చేసిన విడదల రజిని… ఇప్పుడు సైలెంట్ గానే ఉంటున్నారు. మరి ఆమెపై కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళుతుందా… లేదా వెనక్కు తగ్గుతుందా అనేది చూడాలి. అటు మరో మాజీ మంత్రి ఆర్కే రోజా అవినీతి వ్యవహారాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ అధికారులు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే దీనిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉండొచ్చు.




