రేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సరే కొత్త రేషన్ కార్డుల విషయంలో ఇంకా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డుల జారీ విషయంలో అధికారులు చేస్తున్న తప్పులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది రేషన్ కార్డులు తొలగించారు. టిడిపి కి అనుకూలంగా ఉన్న వారి రేషన్ కార్డులను రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read : టీమిండియాకు గుడ్ న్యూస్.. పంజాబీ బౌలర్ వచ్చేస్తున్నాడు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు లేని వారికి అలాగే కొత్త కార్డులు అప్లై చేసిన వారికి జారీ చేస్తూ వస్తున్నారు. అయితే వీటి విషయంలో లోపాలను సరి చేసుకునేందుకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో సమస్యలు ఎక్కువగా ఉండటంతో వాటిని పరిష్కరిస్తుంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను అందిస్తామని.. పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించారు.
Also Read : టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం..
క్యూఆర్ కోడ్ లతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రతి ఒక్కరికి డిజిటల్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి కాసేపటి క్రితం ప్రకటన చేశారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని, ఇకనుంచి రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. ఐదేళ్ల లోపు వారికి అలాగే 80 ఏళ్లు దాటిన వారికి ఈ కేవైసీ తో అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని, అలాగే 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. ఏటీఎం కార్డుల మాదిరిగానే రేషన్ కార్డులు ఉంటాయి అన్నారు.