రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయంలో ఆయనపై కక్ష సాధింపుగా అప్పటి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనే కారణాలను ఆధారాలు లేకుండా చూపిస్తూ ఆయనను రెండుసార్లు సస్పెండ్ చేశారు. 2020 – 2024 మధ్య రెండుసార్లు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు మొదటిసారి ఏబీవీని సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : తులసి బాబు బయటపెట్టిన వ్యక్తి ఎవరు…??
రెండోసారి 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు ఆయన పై సస్పెన్షన్ విధించారు. ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని అలవెన్సులను చెల్లించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఆర్డర్స్ ఇచ్చింది. ఇక ఆయనపై గత ప్రభుత్వ నమోదు చేసిన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : చిరంజీవికి రామ్ చరణ్ రిక్వస్ట్.. తండ్రిని టార్గెట్ చేయడంతో జాగ్రత్తలు…!
ఇంటెలిజెన్స్ ఎడీజీ గా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై గత ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ సస్పెన్షన్ విధించింది. ఆయన కుమారుడి కంపెనీ అడ్డంపెట్టుకుని నిఘా పరికరాలను కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణనల్లో పేర్కొంది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు. ఇక ఏబీవీని రాష్ట్ర ప్రభుత్వం నిఘా విభాగంలో సలహాదారుగా నియమించుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సమర్ధ పోలీసు అధికారిగా పేరున్న ఆయన పని తీరుపై చంద్రబాబుకు నమ్మకం ఎక్కువ. అందుకే ఆయన్ను సలహాదారుగా నియమించుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.