ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఏపీ సర్కార్ వోట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ మీదనే పాలన నిర్వహిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ లోనే బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాలతో ఏపీ ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన కీలక సంక్షేమ కార్యక్రమాల విషయంలో బడ్జెట్ ఇప్పుడు అడ్డంకిగా మారింది అనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ఆలస్యం చేయవద్దని భావిస్తోంది.
Also Read: జగన్ బెయిల్ రద్దుకి రంగం సిద్ధం..?
మళ్ళీ మార్చ్ నెలలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో త్వరగానే ఈ తంతు పూర్తి చేయాలని సర్కార్ కసరత్తు చేస్తోంది. నవంబర్ 11న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. వచ్చే 5 నెలల్లో రాష్ట్ర అవసరాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్యాలను బడ్జెట్ లో పొందుపరచనున్నారు అధికారులు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ 1,73,766 కోట్లుగా ఉండగా… ఈ ఆర్థిక సంవత్సరం రెవెన్యూ 2 లక్షల కోట్లుగా అధికారులు ప్రతిపాదించారు.
Also Read: ఏపిలో ఆ ఒక్క మంత్రిపదవి ఎవరికంటే..?
ఈ నేపద్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వచ్చిన రెవెన్యూ, కొత్త మద్యం పాలసీ తో పాటు ఇతర విధానాల వల్ల పెరిగే రెవెన్యూ పై సీఎం సమీక్ష నిర్వహించి… వివిధ ఆధాయార్జన శాఖల కార్యదర్శులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించారు. ఏయే శాఖల్లో ఆదాయం పెంచుకోవచ్చు అనే దానిపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత కేటాయించాలి, ఏయే సంక్షేమ కార్యక్రమాలను రాబోయే 5 నెలల్లో ప్రకటించాలి అనే దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో మరొక 2 వారాల్లో ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టె అవకాశం ఉంది.