Saturday, September 13, 2025 01:02 AM
Saturday, September 13, 2025 01:02 AM
roots

బెజవాడ వరదలు… ఆ ముగ్గురే హీరోలు

ఎవరూ ఊహించని విధంగా బెజవాడలో భారీ వరదలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయి. వరద బాధితులను సింగ్ నగర్, భవానిపురం, పాయకాపురం, వాంబే కాలనీల నుంచి బయటకు తీసుకు రావడానికి ప్రభుత్వం నానా కష్టాలు పడింది అనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యటనలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టించారు. ఎవరైనా మాట వినకపోతే తన మార్క్ చూపించారు. ఆహారం, తాగు నీరు విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది అనే చెప్పాలి.

ప్రాణ నష్టాన్ని చాలా తక్కువగా ఉండే విధంగా ప్రభుత్వం జాగ్రత్త పడింది. అయితే ఇక్కడ ముగ్గురు అధికారులు సహాయక చర్యల్లో అన్నీ తామై నిలబడ్డారు. చంద్రబాబు ఆదేశాలను పాటించడం నుంచి… ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ బాధితులను కాపాడారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ అధికారి కోన శశిధర్‌ బాధితుల తరలింపు విషయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేకంగా వాహనాలు యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి వరద బాధిత ప్రాంతాల్లోకి స్థానిక కార్పొరేషన్‌ సిబ్బందిని వరద ముంపు బాధితులకు అండగా నిలబడ్డారు.

Read Also : బెజవాడ పై వైసీపీ కి ఇంత అక్కసు ఎందుకు?

అలాగే పోలీసు శాఖ నుంచి ఏడీసీపీ గున్నం రామకృష్ణ సింగ్ నగర్ వద్ద అన్నీ తానై వ్యవహరించారు. బాధితులను కాపాడుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేసారు. కోన శశిధర్‌ తో గున్నం రామకృష్ణ సమన్వయం చేసుకుంటూ బాధితులను బయటకు తరలించారు. అలాగే మరో అధికారి ఈ వరదల్లో కీలకంగా వ్యవహరించారు మాజీ మున్సిపల్ కమిషనర్‌, ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రద్యుమ్న కలెక్టరేట్‌ లోనే కూర్చున్నారు. అక్కడి నుంచి బాధితుల తరలింపు వేగం పుంజుకుంది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆహారం చేర్చడంలో కూడా ఆయనే కీలక భూమిక పోషించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్