Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

ఫైబర్ నెట్ మరో సంచలనం.. మంత్రికి దినేష్ కుమార్ నివేదిక..!

ఏపీ ఫైబర్ నెట్ పై మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సంస్థ మాజీ ఎండీ దినేష్ కుమార్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి నివేదిక పంపారు. రికార్డుల్లో ఉన్న వివరాలను తేదీల వారీగా ప్రస్తావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న జీవీ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దినేష్ వివరణ ఇచ్చారు. ఉన్న బాక్సులు సర్దుబాటు చేసి.. 9,758 కొత్త కనెక్షన్లు ఇచ్చామని అన్నారు.

Also Read: ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!

గత కొన్నేళ్లుగా కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్మెంట్ (సీపీఈ) బాక్సులను సంస్థ ఇవ్వలేదని.. ప్రస్తుతం ఉన్న బాక్సుల జీవితకాలం ముగియడం.. వాటికి మరమ్మతులు వస్తే పూర్తిచేయలేని పరిస్థితి వచ్చింది అన్నారు. ఏపీ ఫైబర్నెట్ నుంచి పెట్టుబడి లేకుండా కొత్త బాక్సులను అందించడంపై అంతర్గత కమిటీని ఏర్పాటుచేశామని.. ఆ కమిటీ గుజరాత్ విధానాన్ని పరిశీలించిందన్నారు. ఈ పరిస్థితుల్లోనూ గత ఐదు నెలల్లో 9,758 కొత్త కనెక్షన్లను అందించామని తెలిపారు.

Also Read: బాలినేని సూపర్ ప్లాన్..!

గత జనవరి నాటికి ఉన్న 4,84,510 కనెక్షన్లకు ఇవి అదనమన్నారు. పాలనాపరంగా.. ఆర్థికంగా సవాళ్లున్నా, నెట్వర్క్ ను విస్తరించే చర్యలను తీసుకున్నామని.. నియామక పత్రాలు లేకుండా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో 417 మందిని తొలగించామని తెలిపారు. సంస్థకు అవసరం లేకుండా మరో 200 మంది పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. వారిని తొలగించే ప్రక్రియ చేపట్టామని… ప్రస్తుతం 925 మందే ఉన్నారన్నారు. సంస్థ వార్షిక టర్నోవర్ తగ్గించి.. రూ.142.46 కోట్లు తక్కువ జీఎస్టీ చెల్లించినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం నోటీసు ఇచ్చిందని తెలిపారు.

Also Read: గెలిచినా… ఉపయోగం లేకుండా పోయిందే..!

దీనిపై విచారణ జరిపేందుకు రికార్డులను అందించాలని 2024 జులై 31న కోరిందని.. ఈ నోటీసుపై ఎలా స్పందించాలనే దానిపై చర్చించామన్నారు. వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై సీఐడీలో నమోదైన కేసు విచారణ జరుగుతోందని.. ఇటీవల సీఐడీ అధికారులు వచ్చి రికార్డులు పరిశీలించారన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్