Saturday, September 13, 2025 03:27 AM
Saturday, September 13, 2025 03:27 AM
roots

ఫైబర్ నెట్ సంచలనం.. వాళ్ళకు 99కే ఇంటర్నెట్…!

ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ కీలక అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లుగా ఫైబర్ నెట్ విషయంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై సీరియస్ గా ఉన్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే ఏపీ ఫైబర్ నెట్ ను గాడిలో పెట్టాలని భావిస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ కు మంచి పేరు తీసుకువచ్చిన ల్యాండ్ లైన్, టీవీ ప్రసారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ప్రస్తుత డిటిహెచ్ సంస్థలకు ధీటుగా హెచ్డీ చానల్స్ ను అందించాలని ఫైబర్ నెట్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా దీనిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read : నేను వస్తున్నా.. పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్

ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 17 లక్షలగా ఉన్న కనెక్షన్లు 2019-24 మధ్యకాలంలో ఐదు లక్షలకు ఎందుకు పడిపోయాయో ఆలోచించి అడుగులు వేయాలని ఫైబర్ నెట్ యాజమాన్యానికి మంత్రి సూచించారు. కనెక్షన్లు పెంచే దిశగా అడుగులు వేయాలని ఆయన అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఇక ఫైబర్ నెట్ లో ఉన్న ఉద్యోగుల తొలగింపు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు మైండ్ పోయే న్యూస్…?

ఇక ఫైబర్ నెట్ సేవల విషయంలో సామాజిక వర్గాల వారీగా కూడా వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 99 రూపాయలకే ఎస్సీ, ఎస్టీలకు ఫైబర్ నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హెచ్డి చానెల్స్ విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా విద్యార్థులు ఉన్న ఇళ్ళకు ఫైబర్ నెట్ సేవలను 99 రూపాయలకు అందించే దిశగా అడుగులు వేయనున్నారు.

Also Read : గల్లా జయదేవ్ కి రాజ్య సభ సీటు దక్కేనా?

అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫైబర్ నెట్ సేవలను ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నాయి. అటు ఏజెన్సీ ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున ఫైబర్ నెట్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం దిశగా అడుగులు వేయాలని… ఇందుకోసం అతి తక్కువ ధరకే టీవీ చానల్స్ అలాగే ఇంటర్నెట్ సేవలను అందించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్