Friday, September 12, 2025 07:19 PM
Friday, September 12, 2025 07:19 PM
roots

వర్మపై ఏపీ సర్కార్ రివేంజ్…?

సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ కు తగిన సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులను జనసేన పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా సినిమాలు తీసి సోషల్ మీడియాలో వాటిపై అభ్యంతరకర రాతలు, అభ్యంతరకరంగా ఎడిటింగ్ లు చేసిన రాంగోపాల్ వర్మ విషయంలో ఏపీ ప్రభుత్వం కాస్త పట్టుదలగానే వ్యవహరిస్తుంది.

Also Read : అరెస్టు వెనుక ఇంత ప్లాన్ ఉందా…!

ఇటీవల ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా జరిగింది. దాదాపుగా ఆయన ఇంటి వద్దకు ఏపీ పోలీసులు వెళ్లారు. అయితే ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ బెయిల్ తెచ్చుకున్నారు. దీనితో అక్కడికి ఆయన అరెస్టు ఆగినా… తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా విషయంలో ఆయనకు అప్పటి ప్రభుత్వం భారీగా చెల్లింపులు చేసిందని ఆయన బయటపెట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

Also Read : కొడుక్కి ఇంత జరుగుతున్నా తండ్రి ఎక్కడ…?

వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడం పై నోటీసు పంపించింది ఆంధ్రప్రదేశ్ ఫైబర్ కార్పొరేషన్. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకుండా సరే ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందడం పై లీగల్ నోటీసులు పంపించింది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండితో సహా ఐదుగురికి నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దీనితో ఈ విషయంలో రాంగోపాల్ వర్మ కు ఉచ్చు బిగించినట్లుగానే తెలుస్తోంది. మరి దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్