ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం మారిన తర్వాత నూతన రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ గా ఉన్నారు. అలాగే మంత్రి నారాయణ కూడా అమరావతి పనుల విషయంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పనులను వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి అమరావతిని దాదాపుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది.
Also Read : ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి కోసమే 15వేల కోట్లను కేటాయించారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ప్రపంచ బ్యాంకు సహకారంతో అమరావతి పనులను పూర్తి చేసేందుకు దృష్టి సారించారు. ఇదే తరుణంలో మంత్రి నారాయణకు అలాగే సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కు మధ్య విభేదాలు తలెత్తినట్టుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సిఆర్డిఏ కమిషనర్ ను తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పలుమార్లు మంత్రి నారాయణ ప్రస్తావిస్తూ వచ్చారు.
Also Read : రజనీ మేడం పాపాలపై.. ప్రభుత్వ పెద్దలను అడ్డం పెట్టుకుని..!
అయితే చంద్రబాబు నాయుడుకు, కాటమనేని భాస్కర్ కు మధ్య మంచి సంబంధాలు ఉండటంతో ఆయన బదిలీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే 2025 జనవరి నుంచి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో అటు నారాయణ కూడా ఈ విషయంలో కాస్త చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో సిఆర్డిఏ కమిషనర్ నను మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు. త్వరలోనే షాన్ మోహన్ ను సీఆర్డీఏ కమిషనర్ గా నియమించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నారాయణతో ఇప్పటికే షాన్ మోహన్ సంప్రదింపులు కూడా జరిపారని, నారాయణ కూడా ఆయన విషయంలో సఖ్యత గానే ఉన్నారని అంటున్నారు. అలాగే సిఆర్డిఏ పరిధిలో పలువురు కీలక అధికారులను కూడా మార్చే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.




