Friday, September 12, 2025 10:41 PM
Friday, September 12, 2025 10:41 PM
roots

ఏపీ బడ్జెట్.. ప్రాధాన్యతలు ఇవే..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్నాయి. ఈనెల 24వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తోంది. గతేడాది జూన్ నెలలో ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటికీ.. వైసీపీ సర్కార్ చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పుల లెక్కలు, అవినీతిని బయటపెట్టడం పై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. దీంతో ముందుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నవంబర్లో నాలుగు నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు.

Also Read : మిర్చి బస్తాల చోరీ.. మరీ ఇంత నీచమా..!

ఇక ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ అయింది. ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో తొలి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

వాస్తవానికి ఈ నెల 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పుడు ఆ తేదీలను మార్చినట్లు తెలుస్తోంది. ఈనెల 27న ఏపీలోని ఏడు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో ఎలక్షన్ కోడ్ కూడా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండకపోవచ్చునేది ప్రభుత్వ పెద్దల మాట. ఎన్నికల అనంతరం సభ్యులంతా సభకు హాజరవుతారు కాబట్టి బడ్జెట్ ప్రతిపాదన తేదీని ఈనెల 28 కి బదులుగా మార్చి 3వ తేదీకి మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : దుమ్ము రేపిన గిల్, రోహిత్.. టోర్నీ ముందు టీంకు జోష్

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 22, 23 తేదీల్లో శాసనసభ్యులకు మండల సభ్యులకు బడ్జెట్ అవగాహన సదస్సు నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ అవగాహన సదస్సు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ ప్రతిపాదనలు ఏడాది రికార్డు స్థాయిలో ఉండొచ్చని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. బడ్జెట్ మొత్తం దాదాపుగా రూ.3 లక్షల కోట్లు వరకు ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేటాయింపులపై కూడా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రధాన ప్రాధాన్యత రంగాల్లో ముందుగా ప్రాథమిక విద్య, వ్యవసాయం, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం సహా మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ గ్యారెంటీ లపై కూడా క్లారిటీ వస్తుందనేది ప్రభుత్వ పెద్దల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్