Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం

ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగం పుంజుకునే సంకేతాలు కనపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, వ్యాపార, మీడియా ప్రముఖుల ఫోన్ లను ట్యాపింగ్ చేసారనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇవి నిజమే అనే అనుమానాలు బలపడ్డాయి. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విశాఖలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. బైబిల్ మీద, తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తానని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు.

Also Read : మాకేం సంబంధం లేదు.. మా జోలికి రావొద్దు..!

వైవీ సుబ్బారెడ్డి తన ఆడియో కూడా వినిపించారన్నారు. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ను ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపిఎస్ అనిల్ కుమార్ పని చేసారు. అప్పటి హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐపిఎస్ జితేందర్.. ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జితేందర్ ,అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేసారు.

Also Read : పాకిస్థాన్ కు ఇజ్రాయిల్ ఊహించని షాక్

ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రివ్యూ కమిటీ లో కీలక సభ్యులుగా జితేందర్, అనిల్ ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ నేరుగా డి వో టి కి పంపారు సీఎస్. 2023 నవంబర్ మాసంలో 600 సెల్ ఫోన్ నంబర్స్ లోని రివ్యూ కమిటీకి ప్రభాకర్ పంపించారు. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టుల పేరుతో ఫోన్లను ప్రభాకర్ రావు టాప్ చేసినట్టు గుర్తించారు. అధికార ,ప్రతిపక్ష వ్యాపారవేత్తలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ ల ఫోన్ లను టాప్ చేసిన ప్రభాకర్ రావు.. విచారణ మొదలైన తర్వాత అమెరికా పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయన కోవర్ట్ గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్