Friday, September 12, 2025 10:10 PM
Friday, September 12, 2025 10:10 PM
roots

మరో సీనియర్ కు గవర్నర్ పదవి..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఎన్డియేలో గవర్నర్ పదవుల సందడి ఎక్కువగా కనపడుతోంది. రాజకీయంగా వాతావరణం బాగుండటంతో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కూటమి. తమ పార్టీ సీనియర్ నేతలకు గౌరవ పదవులు ఇప్పించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును రాష్ట్రపతి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Also Read : ఈరోజు (18-07-2025) రాశి ఫలితాలు

దీనితో మరో సీనియర్ నేతకు కూడా గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినపడుతోంది. ఆయనే కేఈ కృష్ణమూర్తి. టీడీపీలో ఒకప్పుడు బలమైన నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. ఆయన కుమారుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా గవర్నర్ పదవి ఇప్పించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Also Read : ఏడు నెలల్లో అమెరికా ఎంత మందిని బహిష్కరించిందో తెలుసా..?

ఆయనను దాదాపుగా తమిళనాడు గవర్నర్ లేదా పాండిచ్చేరి గవర్నర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. తమిళం కూడా మాట్లాడే ఆయనకు.. ఆ రెండు ప్రాంతాల్లో ఏదోక రాష్ట్రం బాధ్యత అప్పగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరగా.. సానుకూల సమాధానమే వినపడినట్టు సమాచారం. ఆయనతో పాటుగా మరో సీనియర్ నేతకు సైతం కేంద్రంలో పదవి దక్కే అవకాశాలు ఉండవచ్చు అంటున్నాయి టీడీపీ వర్గాలు. తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో బిజేపి ఈ అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్