ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలో దర్యాప్తు పెద్ద ఎత్తున జరుగుతోంది. కీలక వ్యక్తులుగా భావిస్తున్న ఒక్కొక్కరిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో.. వారి లక్ష్యంగా దర్యాప్తు సాగిస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కాం నిందితుడు అనిల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు. షెల్ కంపెనీల పేరిట మద్యం సొమ్మును బదిలీ చేసిన అనిల్ చోఖ్రా.. తర్వాత సిండికేట్ సభ్యులకు సొమ్ము చేరవేసినట్లు గుర్తించారు.
Also Read : పరకామణి కేసులో కూడా జరుగుతాయా..?
రాజ్ కేసిరెడ్డి, అవినాష్ రెడ్డి వసూలు చేసిన రూ.77.55 కోట్లతో ముంబైలో 4 షెల్ కంపెనీలకు సొమ్మును అనిల్ చోఖ్రా బదిలీ చేశారు. అదానీ డిస్టిలరీస్ నుంచి రూ.18 కోట్లు బదిలీ చేసిన అనిల్ చోఖ్రా.. లీలా డిస్టిలరీస్ నుంచి రూ.20 కోట్లు, స్పె ఆగ్రో నుంచి రూ.39కోట్లు.. మొత్తం రూ.77 కోట్లు 4 షెల్ కంపెనీలకు అనిల్ చోఖ్రా బదిలీ చేశారు. అక్కడి నుంచి మరో 32 షెల్ కంపెనీలకు అనిల్ బదిలీ చేశారు. షెల్ కంపెనీల అక్రమాలపై ముంబైలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 10 నుంచి ఈనెల 10 వరకు సిట్ విచారణ జరిపింది.
Also Read : రంగంలోకి రవిశంకర్ అయ్యన్నార్.. సతీష్ హత్యలో సంచలన విషయాలు..!
25 షెల్ కంపెనీలను అడ్రస్‍లతో సహా సిట్ అధికారులు గుర్తించారు. అక్రమ లావాదేవీల కోసమే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన అనిల్.. షెల్ కంపెనీల అడ్రస్ ఉన్న యజమానులతో మాట్లాడగా సదరు సంస్థలకు ఎప్పుడూ లీజుకు ఇవ్వలేదని సిట్ తెలిపింది. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును ఉపయోగించడంలో కీలక పాత్రను అనిల్ చోఖ్రా పోషించాడని తేల్చారు. లిక్కర్ స్కాం నగదును బులియన్ మార్కెట్‍లో అనిల్ చోఖ్రా చేర్చారు. లిక్కర్ స్కాం డబ్బును పలు మార్గాల్లో రాజ్ కేసిరెడ్డి మళ్లించారని.. ఆ తర్వాత అనీల్ కీలక పాత్ర పోషించాడని తెలిపారు. షెల్ కంపెనీల డైరెక్టర్లు, కార్యదర్శుల లిస్ట్ కోసం సిట్ దర్యాప్తు చేస్తోంది. షెల్ కంపెనీలు, లీలా డిస్టిలరీస్‍కు జారీచేసిన114 నకిలీ ఇన్వాయిస్, ఈ-వే బిల్లులను సిట్ సీజ్ చేసింది. రూ.221 కోట్ల నకిలీ ఇన్వాయిస్ లు జారీచేసినట్లు గుర్తించిన సిట్.. ఇందులో కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు.

