ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్న మాటలపై ఆ పార్టీ క్యాడర్ లో అసంతృప్తి వ్యక్తమవుతోందా..? సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేయలేక ఇబ్బంది పడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2024 లో అధికారం కోల్పోయిన జగన్ లో ఇప్పటి ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులపై కూడా ఆగ్రహం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ విషయం ఆయన ప్రసంగాలలో స్పష్టంగా అర్ధమవుతోంది. పదే పదే పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా.. ప్రభుత్వ పెద్దలను విమర్శించే పద్ధతిలో కూడా ఆగ్రహం కనపడుతోంది.
Also Read : బ్లాక్ బాక్స్ కు ఏమైంది.. దర్యాప్తు కష్టమేనా..?
ఇక జగన్ చేస్తున్న చేష్టలు ఆ పార్టీ కార్యకర్తలకు చికాకుగా మారాయి. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్ళడం, అక్కడ కామెడి వ్యాఖ్యలు చేయడం, ఇక రెంటపాళ్ళ పర్యటనలో.. బెట్టింగ్ యాప్స్ తో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడం, అక్కడ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేయడం వంటివి గట్టిగా విమర్శలకు దారి తీసాయి. ఈ రెండు చర్యలు కూడా వైసీపీకి కలిసి రాలేదు. పైగా అక్కడ వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారికి మద్దతుగా జగన్ వ్యాఖ్యలు చేసారు.
Also Read : ఛాన్స్ కొట్టేసిన తమిళ కుర్రోడు.. తెలుగోడికి దక్కని ఛాన్స్
ఈ మనస్తత్వంతోనే గత అయిదేళ్ళు రాష్ట్రం ఇబ్బంది పడింది. జగన్ కు ప్రజలు దూరమైంది కూడా అందుకే. అలాంటిది పదే పదే జగన్ అవే వ్యాఖ్యలు చేయడంపై పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. అధికారంలోకి వస్తే హింస జరగబోతోంది అని జగన్ పరోక్షంగా చెప్పడం, పోలీసులకు వార్నింగ్ లు ఇవ్వడం.. ప్రజల్లో పార్టీపై తప్పుడు సంకేతాలు ఖచ్చితంగా తీసుకు వెళ్తాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదనే భావన ఆ పార్టీ క్యాడర్ లో వినపడుతోంది. ఇక వాటిని ప్రచారం చేయడానికి కూడా ఆ పార్టీ కార్యకర్తలు ఇష్టపడటం లేదు.




