Friday, August 29, 2025 09:32 PM
Friday, August 29, 2025 09:32 PM
roots

అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్ లు కూడా..?

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కాక.. రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ వ్యవహారంలో బిజెపి నేతలు కూడా ఇబ్బంది పడ్డారనే విషయాన్ని తెలుసుకున్న కేంద్ర పెద్దలు, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరు అయ్యారు. ఈ విచారణలో బండి సంజయ్ ఆశ్చర్యపోయే నెంబర్ లు అధికారులు ముందుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఖబడ్డార్ కేటీఆర్.. తడాఖా చూపిస్తాం.. కమ్మ సంఘాల హెచ్చరిక

సిట్ అధికారులు.. కొన్ని ఫోన్ నెంబర్ లు పెట్టగా అందులో ప్రముఖులు ఉన్నారట. సంజయ్ తెలంగాణా బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ తో పలుమార్లు ఫోన్ లో మాట్లాడేవారు. ఆ ముగ్గురు నేతల ఫోన్ నెంబర్ లను సిట్ అధికారులు బండి సంజయ్ ముందుపెట్టారు. ఆ నంబర్ లు ఎవరివి అని అడగడంతో బండి సంజయ్ చూసి షాక్ అయ్యారు. ఎవరివో చెప్పగా అధికారులు కూడా కంగుతిన్నారు.

Also Read : ఓటర్ బాంబు పేల్చిన రాహుల్.. సంచలన లెక్కలు రిలీజ్

అవి అమిత్ షా, జెపి నడ్డా, సంతోష్ నెంబర్ లు అని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి నెంబర్ లు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. వారి ఫోన్ లను సైతం ట్యాప్ చేసారని.. ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించిన ప్రణీత్‌రావుకు ఒక కోడ్‌ ఇచ్చారని.. దాంతో ఆయన రోజూ సంజయ్‌తోపాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్‌లు ట్యాపింగ్‌ చేసి, ముఖ్యమైన సమాచారాన్ని నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిపేవారని సిట్ అధికారులు బండి సంజయ్ కు వివరించగా కేంద్ర మంత్రి కంగుతిన్నారు. 2022 ఆగస్టు నుంచి 2023 మే చివరి వరకూ సీడీఆర్‌ను వారి ముందు ఉంచి వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్