వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 40 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు. ఒడిశా-ఛత్తీస్‌ఘఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. గతంలో మావోయిస్టుల ఆధిపత్యం సాగిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ పేరు పలికేందుకు కూడా గిరిజనులు, ఆదివాసీలు భయపడుతున్నారు. తుపాకీ మోతలు, పోలీసుల కూబింగ్ ఆపరేషన్‌తో దండకారణ్యంలో అలజడి కొనసాగుతోంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియక గిరి పుత్రులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అటు మావోయిస్టులు కూడా కీలక నేతలంతా పిట్టల్లా రాలిపోతుంటే… నక్సల్ బరి ఉద్యమం దాదాపు కనుమరుగైనట్లే అనే మాట బలంగా వినిపిస్తోంది.
Also Read: సర్కార్‌పై అసంతృప్తిగా మంత్రులు.. కారణం..!
ఉద్యమానికి అన్ని విధాలుగా సేఫ్‌గా ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ల కారణంగా మావోయిస్టులు నెమ్మదిగా ఛత్తీస్‌ఘఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబండ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 25 మంది వరకు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి భద్రతా బలగాలు. మృతదేహాలు ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుమట్టడంతో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ కాల్పుల ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ విజయం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read: వచ్చిన పనేంటి.. చంద్రబాబు మాస్ వార్నింగ్..!
ఈ దాడుల్లో రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన కోబ్రా, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన జయరామిరెడ్డి అలియాస్ చలపతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చలపతి కొన్నేళ్లుగా పోలీసులకు మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు జాబితాలో ఉన్నారు. అతనిపై ఇప్పటికే రూ.కోటి రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్ రహిత భారత్ దిశగా అడుగులు పడుతున్నాయని… ఇది హోమ్ శాఖ సాధించిన అతిపెద్ద విజయమంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

