జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు మద్దతు లభిస్తోంది. దాదాపు అగ్ర దేశాలు అన్నీ భారత్ కు అండగా నిలిచాయి. పాకిస్తాన్.. ఉగ్రవాదం విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అటు పాకిస్తాన్ ప్రభుత్వంలో కూడా ఉగ్రవాదం విషయంలో చీలిక వచ్చిందనేది ఆ దేశ రక్షణ మంత్రి దీనిపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసారు. పశ్చిమ దేశాల కోసం తాము చెత్త పనులు చేసామని ఆయన అంగీకరించారు. మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసారు.
Also Read : మరో నోటు మాయమైతుందా..?
ఇక తాజాగా దీనిపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. ఏప్రిల్ 15, 2025న వాషింగ్టన్ లోని స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపింది. భారత్, పాకిస్తాన్ రెండింటితో వాషింగ్టన్ ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
Also Read : ఇంకెన్నాళ్లు ఈ సాగదీత..? టీటీడీపీ భవిష్యత్తు ఏంటీ..?
మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న ఆమె.. నిన్న, కార్యదర్శి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో మాట్లాడినట్లు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ప్రధాని మోడీకి గత వారం హామీ ఇచ్చినట్లుగా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా.. భారత్ తో బలంగా కలిసి పని చేస్తుందని, మోడీ ఏం చేసినా సరే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని కీలక నాయకులతో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నిర్వహించిన సంభాషణలను కూడా ఆమె ప్రస్తావించారు.




