ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జైల్లో నిద్ర రావటం లేదంట. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంబటిని అరెస్టు చేసిన నల్లపాడు పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో.. ఆయనను రాజమండ్రి తరలించారు. అరెస్టు చేసుకోండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన అంబటికి జైల్లో నిద్ర రావడం లేదంట. ఇంకా చెప్పాలంటే.. జైల్లోనే అంబటి రాంబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. నాకేంటి రా.. అని గొప్పలు చెప్పిన అంబటికి.. ఇప్పుడు జైల్లో నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదంట.
వైసీపీ నేతలకు ఇన్ని రోగాలున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. పైకి మాత్రం దిట్టంగా కనిపించే వైసీపీ నేతలు.. జైలుల్లోకి వెళ్లిన వెంటనే లోపలున్న రోగాలన్నీ బయటపడుతున్నాయి. ముందు వల్లభనేని వంశీ, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేశ్.. ఇప్పుడు అంబటి రాంబాబు.. వీళ్లంతా ఒకరి తర్వాత ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. వీళ్లు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని వైసీపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకునే పరిస్థితి. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్ప చూడ పురుగులుండు.. అన్నట్లుగా వైసీపీ నేతల పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబును పదే పదే ముసలోడు ముసలోడు అని ఎద్దేవా చేస్తున్న వైసీపీ నేతలు.. కనీసం నిద్ర పోవడానికి కూడా నానా పాట్లు పడుతున్నారా అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read : తెలంగాణా సైనికులకు జనసేనాని బిగ్ షాక్..!
రెండు రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకు.. నిద్ర కూడా పట్టడం లేదంట. దీంతో నిద్ర పోయేందుకు వైద్యుల సలహా మేరకు ప్రత్యేక వైద్య పరికరం వాడుతున్నారట అంబటి రాంబాబు. అంబటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. నిద్రలో ఒక్కోసారి శ్వాస ఆగిపోతుందని.. మళ్లీ తిరిగి దానికదే మొదలవుతుంది కూడా. అయితే ఇలా ఆగటం ఎక్కువ అయితే.. అది ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు వెల్లడించారు. ఇందుకే వైద్యుల సలహా మేరకు స్లీప్ అప్నియా అనే పరికరాన్ని జైలు అధికారులు అంబటి రాంబాబుకు అందించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సమస్యలు లేకుండా నిద్రలో కూడా పూర్తిస్థాయిలో శ్వాస ఆడేలా పరికరం వాడాలని వైద్యులు సూచించారు. నిజానికి కొంతకాలంగా అంబటి తన ఇంట్లో కూడా ఈ పరికరం వాడుతున్నట్లు ఇప్పుడే బయట పడింది. నిజానికి రిమాండ్ విధించిన వెంటనే న్యాయమూర్తికి అంబటి రాంబాబు తన సమస్యను చెప్పినట్లు తెలుస్తోంది. నిద్రలో తన శ్వాస ఎప్పుడైనా ఆగిపోయే అవకాశం ఉందని.. అందుకు స్లీప్ అప్నియా పరికరం వాడేందుకు అనుమతి కోరారు. దీంతో కోర్టు కూడా ఇందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో అంబటి రాజమండ్రి జైల్లో స్లీప్ అప్నియా పరికరం పెట్టుకుని నిద్రపోతున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అంబటి జైల్లో ఉన్నన్ని రోజులు ఈ పరికరం తప్పకుండా వాడాల్సిన పరిస్ధితి.
నిజానికి ఇది అంబటికి మాత్రమే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, జోగి రమేశ్ వంటి నేతలు బూతులతో రెచ్చిపోయారు. ఇలాంటి వారిని జగన్ పొగడ్తలతో ముంచెత్తారు. అందగాడు.. అంటూ ప్రత్యేకంగా కీర్తించారు కూడా. అంబటి రాంబాబు అయితే.. సంక్రాంతి పండుగకు రోడ్డు మీద డ్యాన్సులు కూడా వేశారు. అందుకే అందరు అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని కూడా అంటారు. కానీ వైసీపీ ఓడిన తర్వాతే వీళ్ల ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి. వల్లభనేని వంశీకి కూడా స్లీప్ అప్నియా ఉంది. ఆయన కూడా జైల్లో సీప్ యాప్ మిషన్ వాడారు. ఇక నా బొచ్చు కూడా పీకలేరు అంటూ బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని అయితే.. ఏకంగా ముంబై వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఇటీవల ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు.. బొచ్చు పీకిన కోడి మాదిరిగా ఉన్నాడే అనే కామెంట్లు కూడా చేశారు పలువురు నెటిజన్లు. ఇక లిక్కర్ స్కామ్లో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్టు అయిన తర్వాత తాను వెన్నునొప్పితో చాలా రోజులుగా బాధపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. వెరికోస్ వెయిన్స్తో చెవిరెడ్డి బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించడంతో.. మంతెన ఆశ్రమంలో ప్రకృతి వైద్యం చేయించుకోవడానికి కోర్టు 15 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
Also Read : ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం..!
ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన తర్వాత.. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడే ఆయనకు కూడా కావాల్సినన్ని రోగాలున్నట్లు బయటపడింది. జోగి జైలులో తీవ్ర అనారోగ్యం పాలయ్యారని.. అందుకే ఆయనను కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనారోగ్యం కారణంగా జైలులో నిద్ర రావడం లేదని కోర్టుకు తెలిపారు. చికిత్స కోసం నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు మార్చాలని కోరారు కూడా. జైలుకు వెళ్లిన తర్వాత వైసీపీ నేతల అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. వాళ్ల రోగాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో.. సొంత పార్టీ నేతలే అయ్యో రామా అంటున్నారు.

