గత ఏడాది భారత్ రెండవ సారి టి20 ప్రపంచ కప్ గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యంత క్లిష్టమైన మ్యాచ్ లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవడానికి ప్రధాన కారణం.. బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ యాదవ్.. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టడమే. అక్కడి నుంచి సఫారీ జట్టు కోలుకోలేకపోయింది. ఈ క్యాచ్ పై పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ కూడా చేసారు.
Also Read : వైసీపీకి టీడీపీ బంపర్ ఆఫర్..!
దీనిపై భారత మాజీ క్రికెట్ అంబటి రాయుడు సంచలన కామెంట్స్ చేసారు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన ఏడాది తర్వాత ఆ అవుట్ గురించి మాట్లాడాడు. అప్పుడు కామెంటరీ బాక్స్ లో ఉన్న రాయుడు.. బౌండరీ లైన్ వద్ద జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ‘అన్‌ఫిల్టర్డ్ పాడ్‌కాస్ట్’లో, వరల్డ్ ఫీడ్ టీం.. మ్యాచ్ ప్రసారం చేసే వారికి, సహాయం చేసేందుకు బౌండరీ లైన్ వద్ద ఒక కుర్చీ, స్క్రీన్ పెట్టిందని తెలిపాడు. మ్యాచ్ కు ముందే వాటిని అక్కడ పెట్టారు అన్నాడు.
Also Read : తెలుగోడికే ఛాన్స్.. గిల్ కు టీమ్ యాజమాన్యం షాక్
వాటిని అక్కడ ఉంచే సమయంలో కుర్చీ బౌండరీ లైన్ కు తగిలి వెనక్కు వెళ్లిందని పేర్కొన్నారు. కాని మళ్ళీ ఆ తాడును ఆ స్థానంలో ఉంచలేదని అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఐసిసి రూల్స్ కూడా ఈ విషయంలో భారత్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. సెక్షన్ 19.3 ప్రకారం.. బౌండరీ లైన్ ఏ కారణం చేతనైనా జరిగితే.. దాని అసలు స్థానాన్నే బౌండరీకి కన్సిడర్ చేస్తారు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తమ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా దూకుడుగా ఆడినా.. చివర్లో బూమ్రా ధాటికి ఇబ్బంది పడింది.