Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

ఇదెక్కడి ట్విస్ట్, బుకింగ్ యాప్స్ లో పుష్పకు షాక్ ఇస్తున్న అమరన్

ఈ రోజుల్లో ఓ సినిమా రిలీజ్ అయి 15 రోజులు ఆడితే చాలా గొప్ప. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే తొలి 15 రోజులే సినిమాకు అత్యంత కీలకం. ఆ తర్వాత సినిమాపై ఆసక్తి తగ్గిపోవడం, అది కూడా హిట్ సినిమా అనే టాక్ వస్తేనే వసూళ్లు పెరగడం మనం చూస్తూ ఉంటాం. కాని ఓ తమిళ సినిమా మాత్రం తెలుగు సినిమాలకు కూడా సవాల్ చేస్తోంది. బుకింగ్ యాప్స్ లో ఊహించని డామినేషన్ కంటిన్యూ చేస్తోంది. అది కూడా సినిమా రిలీజ్ అయి నెల రోజులు కావొస్తున్న సమయంలో… ఆ సినిమా స్పీడ్ అందుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటో చూస్తే…

ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ అనే ఓ వీరుడి కథతో అత్యంత గొప్పగా తెరకెక్కించిన సినిమా అమరన్ ఇప్పటికీ ప్రేక్షకుల మన్నలను పొందడమే కాదు వసూళ్ళలో తన డామినేషన్ కంటిన్యూ చేస్తోంది. సాధారణంగా యుద్ద వీరుల కథలు అంటే… క్షేత్ర స్థాయిలో జరిగే పోరాటాలకు మాత్రమె ప్రాధాన్యత ఇస్తారు. కాని అమరన్ సినిమాలో ఓ ఆర్మీ అధికారి కుటుంబం పడే మానసిక సంఘర్షణ, ప్రధానంగా అతని జీవిత భాగస్వామి అనుభవించే నిద్రలేని రాత్రులు, యుద్ద క్షేత్రంలో జరిగే పోరాటాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు.

Also Read : హీరోకు 300 కోట్లు.. అభిమానుల జేబులకు మాత్రం చిల్లు

సాఫ్ట్ గా కనపడే శివ కార్తికేయన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. ఇక సాయి పల్లవి అయితే ఇందు రెబెకా వర్గీస్ పాత్రకు సిల్వర్ స్క్రీన్ పై ప్రాణం పోసింది. ఆ పాత్రలో మరే నటి కూడా అంత గొప్పగా చేయలేరు అన్నట్టుగా నటించింది. క్లైమాక్స్ అలాగే సెకండ్ ఆఫ్ లో లైవ్ ఫోన్ కాల్ లో కాల్పులు జరుగుతున్నప్పుడు ఆమె నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ తన కుమార్తెను పెంచే పాత్రలో సాయి పల్లవి జీవించింది. శివ కార్తికేయన్ పాత్రకు ఎంత వెయిట్ ఉందో అంతకు మించి సాయి పల్లవి పాత్రకు వెయిట్ ఇచ్చాడు దర్శకుడు.

దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి… ప్రతిభకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆర్మీ అంటే యుద్ధం మాత్రమే అనుకునే సాధారణ సినీ ప్రేక్షకుడికి ఈ సినిమా ఓ గొప్ప అనుభూతిని పంచింది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు భావోద్వేగానికి గురై, కంట నీరు కారుస్తూ రావడం ఈ మధ్య కాలంలో అమరన్ సినిమాకే చెల్లింది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కచ్చితంగా ప్రతీ భారతీయుడు చూడవలసిన సినిమా అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు కొనియాడటం గమనార్హం.

Also Read : దక్షిణ భారతంలో పార్లమెంట్ సమావేశాలు…!

ఈ సినిమాను మరో రెండు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. అలాంటి టైం లో బుక్ మై షోలో సినిమా బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఓ యుద్ద వీరుడి జీవితానికి మరోసారి ఘనమైన వీడ్కోలు పలకాలని థియేటర్ కు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. ఉన్నత విలువలతో తెరకెక్కించిన సినిమాను థియేటర్లో మరోసారి చూడాలని సగటు సినీ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే పుష్ప 2 సినిమాతో విడుదలైన నెల రోజుల తర్వాత పోటీ పడుతోంది అమరన్. సోమవారం ఉదయం నుంచి బుకింగ్స్ భారీగా జరిగాయి. బుక్ మై షో యాప్ లోనే 24 గంటల్లో 13 వేల టికెట్ లు ఓ దశలో బుక్ అయ్యాయి. పుష్ప 2 కు 19 వేల టికెట్ లు బుక్ అయితే అమరన్ కు 13 వేల టికెట్ లు బుక్ కావడం చూసి ఈ సినిమా అభిమానులు పొంగిపోతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్