ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కాస్త డల్ అయ్యాడు. పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా వైల్డ్ ఫైర్ అయింది అనే సంతోషం కంటే అరెస్టు చేశారనే బాధలో ఎక్కువగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు పెద్దగా బయట కనబడటం లేదు. రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రసంగం తర్వాత అల్లు అర్జున్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. స్టార్ హీరోలు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళితే అల్లు అర్జున్ మాత్రం పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్టు కనపడలేదు. ప్రస్తుతం ఈ కేసు నుంచి ఎలా బయటకు రావాలి అనే దాని పైనే వర్కౌట్ చేస్తున్నాడు.
Also Read : టీడీపీలో సీనియర్లకు గుర్తింపు ఏదీ..?
అయితే లేటెస్ట్ గా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చింది. దీనితో బన్నీ మళ్ళీ సినిమా షూటింగులు మొదలు పెడతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి త్రివిక్రమ్ ఎప్పుడో కథ రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. అసలు అల్లు అర్జున్ జైలుకు వెళ్లకపోతే జనవరి 5 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమా విషయంలో పెద్దగా సీరియస్ ఫోకస్ చేయలేదు.
Also Read : స్వామి దర్శనం అవ్వాలంటే.. జేఈవో దయ ఉండాల్సిందేనా?
అయితే రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం అల్లు అర్జున్ సినిమా షూటింగ్ కు రెడీగా ఉన్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్కు అలాగే సినిమా నిర్మాతలకు ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేశాడు. తాను షూటింగ్ కి రెడీగా ఉన్నానని.. అయితే ఫిబ్రవరి నుంచి షూటింగ్లో పాల్గొంటానని.. ప్రస్తుతం హాలిడే ట్రిప్ కు వెళుతున్నట్టు త్రివిక్రమ్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు బెయిల్ కూడా రావడంతో బన్నీ ఒకరకంగా ఈ కేసు నుంచి కొంత రిలీఫ్ పొందినట్లే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతవరకు రెడీగా ఉన్నాడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ త్రివిక్రమ్ రెడీగా ఉంటే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఇతర నటులతో కంటిన్యూ కావాలని నిర్మాత నాగ వంశీ.. త్రివిక్రమ్ కు చెప్పారట.