Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. దాదాపు నెల రోజుల నుంచి కేటీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఫోన్ టాపింగ్ విషయంలో అలాగే ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ ను సాక్షాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొంది. దీనితో ఆయనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు కీలక అడుగు పడినట్లుగా సమాచారం.

Also Read : ప్రభుత్వానికి కొత్త చిక్కుగా సరస్వతి వ్యవహారం…!

రేసుకు ముందే నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్దంగా విదేశీ కరెన్సీ ఇవ్వడంపై విచారణ జరిపి ఆయనను నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేయాలి అంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోతే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గవర్నర్ అనుమతి కూడా కోరారు.

Also Read : అమరావతికి మరో మణిహారం.. బాబు కీలక ప్రకటన

దీనికి గవర్నర్ కూడా న్యాయసలహా తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఫార్ములా రేస్ విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ విషయంలో కీలక అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే కేటీఆర్ ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నేతలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని సలహాలు ఇస్తున్నారట. కేటీఆర్ ను అరెస్టు చేస్తే కచ్చితంగా సానుభూతి పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ కు భయపడి అరెస్టు చేసినట్టు ఉంటుందని… ఈ విషయంలో కేటీఆర్ నెల రోజుల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కాబట్టి రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు రేవంత్ కు సలహాలు ఇస్తున్నారు. దీనితో ఆయనను అరెస్టు చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్